Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: రూ. 16.25 కోట్ల ఆటగాడికి షాకిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్!

IPL 2024, CSK Release Ben Stokes: ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో తమ సంప్రదాయానికి విరుద్దంగా రూ. 16.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ గుడ్‌బై చెప్పేందుకు సిద్దమైంది.

గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకే పరిమితమైన బెన్ స్టోక్స్.. మధ్యలోనే స్వదేశం వెళ్లిపోయాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే సత్తా చాటడంతో సీఎస్‌కేకు భారీ నష్టం తప్పింది. లేకుంటే బెన్ స్టోక్స్ కారణంగా ఆ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోనేది.

IPL 2024: CSK Likely To Release Ben Stokes Due To Englands Packed Test Calendar

అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన వేలాన్ని బీసీసీఐ డిసెంబర్‌లో నిర్వహించనుంది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న వేలానికి ముహుర్తం ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ కార్యచరణను బీసీసీఐ ప్రారంభించనుంది. ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ఓపెన్ అవ్వగా.. నవంబర్ 26లోపు ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ జాబితాలను అందజేయాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్ల జాబితాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న బెన్ స్టోక్స్‌ను సీఎస్‌కే వదులుకోవడానికి సిద్దమైందని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గాయంతో పాటు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా సిరీస్‌లు ఆడాల్సి ఉండటంతో అతన్ని వదులుకోవడమే ఉత్తమమని సీఎస్‌కే భావించింది.

IPL 2024: CSK Likely To Release Ben Stokes Due To Englands Packed Test Calendar

బెన్ స్టోక్స్‌తో పాటు కైల్ జెమీసన్, సిసండ మగలా, సిమ్రన్‌జీత్ సింగ్, తెలుగు తేజం షేక్ రషీద్‌లను కూడా సీఎస్‌కే వదులుకోనున్నట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ వదులుకునే ఆటగాళ్ల జాబితా:

బెన్ స్టోక్స్ -రూ. 16.25 కోట్లు
అంబటి రాయడు -రూ. 6.75 కోట్లు
కైల్ జెమీసన్-రూ. కోటి
సిసండ మగలా-రూ.50 లక్షలు
సిమ్రన్‌జీత్ సింగ్-రూ. 20 లక్షలు
షేక్ రషీద్-రూ. 20 లక్షలు

Story first published: Tuesday, November 14, 2023, 22:35 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+