Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: ధోనీ రిటైర్మెంట్.. సీఎస్‌కే బిగ్ అప్‌డేట్!

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) దిగ్గజ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో చెన్నై ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో చెన్నైని ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ చివరి వరకు కష్టపడ్డాడు. ఈ మ్యాచ్‌తోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత సీజన్‌లో మాత్రం చెన్నై వేదికగా సొంత అభిమానుల సమక్షంలో ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు.

IPL 2024 CSK gives latest update on MS Dhoni s retirement from IPL

ఆ క్రమంలోనే చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆటకు గుడ్ బై చెప్పాలని ధోనీ ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆర్‌సీబీ రూపంలో సీఎస్‌కే‌కు బిగ్ షాక్ తగలడంతో ధోనీ రిటైర్మెంట్ వ్యూహాలు దెబ్బతిన్నాయి. వచ్చే ఏడా మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ ఐపీఎల్‌లో కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఒక్క సీజన్ కోసం ధోనీని రిటైర్మెంట్ చేసుకుంటే జట్టుకు తీవ్ర నష్టం జరగనుంది.

ఈ క్రమంలోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అతను వచ్చే సీజన్ కూడా ఆడాలని తాము కోరుకుంటున్నామని పేర్కొంది.

అయితే జట్టుకు ప్రయోజనకరమైన నిర్ణయాన్నే ధోనీ తీసుకుంటాడని, అతను కొనసాగినా.. వీడ్కోలు పలికినా తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్‌కే‌కు చెందిన ఓ అధికారిక ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

'ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఇప్పటి వరకు ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయాన్ని తీసుకుంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు. అతను ఇంకా ఫిట్‌గా ఉండటం మాకు కలిసొచ్చే అంశం.

వికెట్ల మధ్య పరుగెత్తడంలో అతను ఎక్కువ ఇబ్బంది పడటం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై చాలా మంది స్టార్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం వచ్చే సీజన్‌లో ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని కోరుతున్నారు. అయితే ధోనీ ఏం నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా.. మేం అంగీకరిస్తాం. అతను ఎప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఏ నిర్ణయమైనా తీసుకుంటాడు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

Story first published: Monday, May 20, 2024, 14:31 [IST]
Other articles published on May 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+