IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఫ్రాంచైజీకి బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి స్వతహాగా తప్పుకున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్ చేసుకోవడంతో పాటు ఫిట్‌గా ఉండేందుకు బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ ముందు టీమిండియాతో ఇంగ్లండ్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సి ఉండటం.. అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 జరగనుండటంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అతని నిర్ణయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ గౌరవిస్తుందని, అతనికి తమ ఫ్రాంచైజీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపింది.

32 ఏళ్ల బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో తమ సంప్రదాయానికి విరుద్దంగా చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకే పరిమితమైన బెన్ స్టోక్స్.. మధ్యలోనే స్వదేశం వెళ్లిపోయాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే సత్తా చాటడంతో సీఎస్‌కేకు భారీ నష్టం తప్పింది. లేకుంటే బెన్ స్టోక్స్ కారణంగా ఆ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోనేది.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ రెండో వారంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బెన్ స్టోక్స్ స్వయంగా ఐపీఎల్ 2024 సీజన్ నుంచి తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని వదిలేయనుంది.
అయితే స్టోక్స్‌ను వదిలేసే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ సీఎస్‌కే విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలో అతని పేరు ముందే ఉండనుంది. వచ్చే నెలలో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం మొత్తం 590 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నుంచి కొంతమందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేయనుంది.