Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: డెవాన్ కాన్వే ఔట్.. CSK తరఫున ఆడే విదేశీ ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్ 2024 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సిద్దమవుతోంది. మార్చి 22న సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగే తొలి మ్యాచ్‌తో సీఎస్‌కే ఈ సీజన్‌ను మొదలుపెట్టనుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మరో టైటిల్‌పై కన్నేసింది. ఇప్పటికే చెన్నై వేదికగా ప్రీ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది.

ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో జట్టు బలహీనతలను అధిగమించిన సీఎస్‌కే.. కుర్రాళ్లు, సీనియర్ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. అయితే ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్‌కు దూరమవ్వడంతో తుది జట్టులో బరిలోకి దిగే నలుగురు ఓవర్‌సీస్ ఆటగాళ్లు ఎవరా..? అనేది ఆసక్తికరంగా మారింది.

IPL 2024 CSK 4 Overseas Players Who Will Play All Matches

డెవాన్ కాన్వే స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఆడనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మిచెల్ సాంట్నర్ బరిలోకి దిగనుండగా.. అతనికి మొయిన్ అలీతో పోటీ ఉండనుంది. పేసర్‌గా మతీష పతీరణతో పాటు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లో ఒకరు ఆడనున్నారు. మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ ఆడటం ఖాయం.

ఈ నలుగురు ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో మిచెల్ సాంట్నర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లకే ప్రాధాన్యత దక్కనుంది.

తుది జట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్/మతీష పతీరణ

మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, సిమ్రాన్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్

రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్(రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ( రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్( రూ. 2 కోట్లు), అవనీష్ అరవెల్లి(రూ. 20 లక్షలు)

Story first published: Thursday, March 14, 2024, 15:24 [IST]
Other articles published on Mar 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+