Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: సరికొత్త చరిత్ర!

ఐపీఎల్ 2024 సీజన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్‌లో అసాధారణ ఘనతలు నమోదయ్యాయి. మరెన్నో ఆల్‌టైమ్ రికార్డ్స్ బద్దలయ్యాయి. అత్యధిక సిక్స్‌లు, బౌండరీలు, భారీ స్కోర్లతో పాటు కనీవినీ ఎరుగని రికార్డ్స్ నమోదయ్యాయి.

శతకాల విషయంలో ఐపీఎల్ 2024 సీజన్ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 14 శతకాలు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. గతేడాది 12 శతకాలు నమోదవ్వగా.. తాజా సీజన్ ఆ ఘనతను అధిగమించింది.

IPL 2024 creates history as record for most centuries

ఈ సీజన్‌లో వివిధ జట్లకు చెందిన మొత్తం 13 మంది ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే 2 శతకాలు సాధించాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ సెంచరీని లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ మార్కస్ సోయినీస్ నమోదు చేశాడు. 63 బంతుల్లోనే 123 పరుగులతో అజేయంగా నిలిచాడు.

IPL 2024 creates history as record for most centuries

అతనితో పాటు విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 113 నాటౌట్), సునీల్ నరైన్(56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 108 నాటౌట్), జానీ బెయిర్ స్టో(48 బంతుల్లో 108 నాటౌట్), జోస్ బట్లర్(60 బంతుల్లో 107 నాటౌట్), రోహిత్ శర్మ(63 బంతుల్లో 105 నాటౌట్), యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104), సాయి సుదర్శన్(51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 102 నాటౌట్), ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102), జోస్ బట్లర్(58 బంతుల్లో 100 నాటౌట్), విల్ జాక్స్(41 బంతుల్లో 100 నాటౌట్) వరుసగా సెంచరీలు నమోదు చేశారు.

IPL 2024 creates history as record for most centuries

ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను ట్రావిస్ హెడ్, విల్ జాక్స్ నమోదు చేశారు. ఈ ఇద్దరూ 41 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నారు.

సీజన్ల వారిగా నమోదైన శతకాల సంఖ్య

ఐపీఎల్ 2008: 6 సెంచరీలు

ఐపీఎల్ 2009: 2 సెంచరీలు

ఐపీఎల్ 2010: 4 సెంచరీలు

ఐపీఎల్ 2011: 6 సెంచరీలు

ఐపీఎల్ 2012: 6 సెంచరీలు

ఐపీఎల్ 2013: 4 సెంచరీలు

ఐపీఎల్ 2014: 3 సెంచరీలు

ఐపీఎల్ 2015: 4 సెంచరీలు

ఐపీఎల్ 2016: 7 సెంచరీలు

ఐపీఎల్ 2017: 5 సెంచరీలు

ఐపీఎల్ 2018: 5 సెంచరీలు

ఐపీఎల్ 2019: 6 సెంచరీలు

ఐపీఎల్ 2020: 5 సెంచరీలు

ఐపీఎల్ 2021: 4 సెంచరీలు

ఐపీఎల్ 2022: 8 సెంచరీలు

ఐపీఎల్ 2023: 12 సెంచరీలు

ఐపీఎల్ 2024: 14 సెంచరీలు

Story first published: Tuesday, May 28, 2024, 22:03 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+