Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: మినీ వేలం తర్వాత పవర్‌ఫుల్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. తుది జట్టు అంచనా ఇదే!

ఐపీఎల్ 2024 వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా తెలివిగా వ్యవహరించింది. టీమ్ బలహీనతలపైనే ఫోకస్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. రూ. 31.40 కోట్ల పర్స్‌ మనీతో వేలానికి వచ్చిన సీఎస్‌కే ఏమాత్రం దుబార చేయకుండా ప్రతీ పైసాను జట్టు మేలు కోసం ఖర్చు చేసింది.

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), డారిల్ మిచెల్‌(రూ.14 కోట్లు)‌తో పాటు యువ కెరటం సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అంబటి రాయుడు, బెన్ స్టోక్స్ లేని లోటును భర్తీ చేసింది. సురేశ్ రైనా తరహాలో ఆడే సమీర్ రిజ్వీపై సీఎస్‌కే కోట్లు కురిపించి టీమ్ భవిష్యత్తుకు బాటలు వేసింది.

IPL 2024: Chennai Super Kings strongest playing 11 after mini-auction

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను రూ. 4 కోట్లకే తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. చెన్నైకి ఆడే సమయంలో ఓ వెలుగు వెలిగిన శార్దూల్.. పూర్వ వైభవం అందుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఓవర్‌సీస్ పేసర్‌గా బంగ్లాదేశ్ వెటరన్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెన్నై కొనుగోలు చేసింది. రూ. 2 కోట్లకే అతన్ని సొంతం చేసుకుంది. తెలుగు తేజం, యువ వికెట్ కీపర్ అవనీష్ అరవెల్లిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

వేలం అనంతరం చెన్నై జట్టు కుర్రాళ్లు, అనుభవం కలిగిన ప్లేయర్లతో సమతూకంగా కనిపిస్తోంది. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలం కాగా.. జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్.. పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తోంది.

గత సీజన్‌లో బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపించిన సీఎస్‌కే.. ఈ వేలంలో ఆ సమస్యను కూడా అధిగమించింది. ఓపెనర్లుగా రుతురాజ్, డెవాన్ కాన్వే బరిలోకి దిగనుండగా.. ఫస్ట్ డౌన్‌లో డారిల్ మిచెల్/రచిన్ రవీంద్రలో ఒకరు ఆడనున్నారు. నాలుగో స్థానంలో అజింక్యా రహానే, ఐదో స్థానంలో శివమ్ దూబే బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఆడనుండగా.. వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగనున్నాడు.

పేసర్లుగా మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు ఆడనున్నారు.

తుది జట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్/మతీష పతీరణ

చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ప్లేయర్లు:
రచిన్ రవీంద్ర (రూ. 1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ. 4 కోట్లు), డారిల్ మిచెల్(రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ( రూ. 8.40 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్( రూ. 2 కోట్లు), అవనీష్ అరవెల్లి(రూ. 20 లక్షలు)

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ లిస్ట్:

మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, సిమ్రాన్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్

Story first published: Sunday, December 31, 2023, 15:40 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+