Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే!

IPL 2024: అప్‌కమింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2024 కార్యచరణను బీసీసీఐ ప్రారంభించనుంది. డిసెంబర్ 15-19 మధ్య దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే మినీ వేలానికి కావాల్సిన ఏర్పాట్లపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫోకస్ పెట్టింది.

ఫ్రాంచైజీలకు మినీ వేలానికి సంబంధించిన సమాచారాన్ని అందజేయడంతో పాటు రిలీజ్, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు అందజేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఐపీఎల్ 2024‌కు సంబంధించిన ట్రేడింగ్ విండో ఓపెన్ అవ్వగా.. ముంబై ఇండియన్స్ వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తీసుకుంది.

IPL 2024: Checkout the top players released by all 10 Teams ahead of the Upcoming IPL mini Auction

ఇక పది ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను బోర్డుకు అందజేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 10 ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. భారీ ధర పలికిన జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, హర్షల్ పటేల్, ఆండ్రీ రస్సెల్, పృథ్వీ షా వంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసినట్లు తెలుస్తోంది.

ఫ్రాంచైజీల వారిగా రిలీజ్ చేసినఆటగాళ్ల జాబితా!

1. చెన్నై సూపర్ కింగ్స్
బెన్ స్టోక్స్ -రూ. 16.25 కోట్లు
అంబటి రాయడు -రూ. 6.75 కోట్లు
కైల్ జెమీసన్-రూ. కోటి
సిసండ మగలా-రూ.50 లక్షలు
సిమ్రన్‌జీత్ సింగ్-రూ. 20 లక్షలు
షేక్ రషీద్-రూ. 20 లక్షలు

2. ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా-రూ.7.5 కోట్ల
మనీశ్ పాండే-రూ.2.4 కోట్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్-రూ. కోటి
లుంగి ఎంగిడి- రూ. 5 లక్షలు
రిపాల్ పటేల్- రూ. 20 లక్షలు

3. గుజరాత్ టైటాన్స్
యశ్ దయాల్- రూ.3.2 కోట్లు
డసన్ షనక- రూ. 2 కోట్లు
ఓడియన్ స్మిత్- రూ. 50 లక్షలు
ప్రదీప్ సంగ్వాన్- రూ. 20 లక్షలు
ఉర్విల్ పటేల్- రూ. 20 లక్షలు

4. కోల్‌కతా నైట్‌రైడర్స్
ఆండ్రూ రస్సెల్- రూ. 12 కోట్లు
లాకీ ఫెర్గూసన్- రూ. 10 కోట్లు
డేవిడ్ వైస్- రూ. కోటి
షకీబ్ అల్ హసన్- రూ. 50 లక్షలు
జాన్సన్ చార్లెస్- రూ. 50 లక్షలు
మన్‌దీప్ సింగ్-రూ. 50 లక్షలు

5. లక్నో సూపర్ జెయింట్స్
ఆవేశ్ ఖాన్-రూ. 10 కోట్లు
డానియల్ సామ్స్-రూ. 75 లక్షలు
జయదేవ్ ఉనాద్కత్- రూ. 50 లక్షలు
రోమారియో షెఫర్డ్- రూ. 50 లక్షలు(ట్రేడ్)
సూర్యాన్ష్ షెగ్దే- రూ. 20 లక్షలు

6. ముంబై ఇండియన్స్
జోఫ్రా ఆర్చర్- రూ. 8 కోట్లు
క్రిస్ జోర్డాన్- రూ. 50 లక్షలు
డౌన్ జాన్సెన్- రూ. 20 లక్షలు
ట్రిస్టాన్ స్టబ్స్- రూ. 20 లక్షలు
అర్షద్ ఖాన్- రూ. 20 లక్షలు

7. పంజాబ్ కింగ్స్
రాహుల్ చాహర్- రూ. 5.2 కోట్లు
హర్ష్‌త్ భాటియా- రూ. 40 లక్షలు
మాథ్యూ షార్ట్- రూ. 20 లక్షలు
బాల్తేజ్ ధండా- రూ. 20 లక్షలు

8. రాజస్థాన్ రాయల్స్
జాసన్ హోల్డర్- రూ. 5.75 కోట్లు
జోరూట్- రూ. కోటి
కేసీ కరియప్ప- రూ. 30 లక్షలు
మురుగన్ అశ్విన్- రూ. 20 లక్షలు

9. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
హర్షల్ పటేల్- రూ. 10 కోట్లు
దినేశ్ కార్తీక్- రూ. 5.5 కోట్లు
అనుజ్ రావత్- రూ. 3.4 కోట్లు
ఫిన్ అలెన్- రూ. 80 లక్షలు

10. సన్‌రైజర్స్ హైదరాబాద్
హ్యారీ బ్రూక్- రూ. 13.25 కోట్లు
మయాంక్ అగర్వాల్- రూ. 8.25 కోట్లు
ఆదిల్ రషీద్- రూ. 2 కోట్లు
అకీల్ హొస్సెన్- రూ. కోటి

Story first published: Saturday, November 11, 2023, 19:58 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+