ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశా పతిరణ గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉందని సీఎస్‌కే వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మతీశా పతిరణ తొడ కండరాల గాయానికి గురయ్యాడు.
బౌలింగ్ పూర్తి చేయకుండా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతని తొడ కండరాల గాయం నయమవ్వడానికి నాలుగైదు వారాల సమయం పట్టనుందని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ఆరంభ మ్యాచ్‌లకు అతను దూరం కానున్నాడు.

19 వికెట్లతో..
ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో పతిరణ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. 'తొడ కండరాల గాయంతో బాధపడుతున్న మతీశా పతిరణ గాయం మరింత తీవ్రమైంది. అతను కోలుకోవడానికి కనీసం ఐదు వారాలు పట్టే అవకాశం ఉంది. దాంతో అతను ఎప్పుడు జట్టులో కలుస్తాడని చెప్పలేకపోతున్నాం.'అని సీఎస్‌కే వర్గాలు మీడియాకు తెలిపాయి.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్.. స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీతో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ ఉండటంతో..
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామని పేర్కొంది. దాంతో బీసీసీఐకి ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణ తలనొప్పిగా మారింది. జూన్ 1 నుంచే అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కావడంతో..మే చివరి వారానికి ముందే ఐపీఎల్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ వేదికగానే ఈ సీజన్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. 2019 మాదిరే భారత్‌లోనే ఈ సీజన్‌ను పూర్తి చేయాలనుకుంటోంది. మరో 24 గంటల్లో ఐపీఎల్ 2024 షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.