For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024 Auction: ఈ స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్.. అన్‌సోల్డ్ లిస్ట్‌లోనే..!

IPL 2024 సీజన్ మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ ప్రక్రియను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియను ముగించిన బీసీసీఐ.. ఆటగాళ్ల ట్రేడింగ్ విండోకు డిసెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు వేలంలో పాల్గొనేందుకు ఆసక్తికనబర్చిన ఆటగాళ్ల వివరాలను ఫ్రాంచైజీకి అందజేసింది.

మొత్తం 1166 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇందులో 830 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 336 మంది ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉన్నారు. 909 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉండగా.. 202 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారున్నారు. మరో 45 మంది అసోసియేట్ నేషన్ ఆటగాళ్లున్నారు.

IPL 2024 Auction: These Capped Players And Cricketers Who Might Go Unsold

రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన అనంతరం 10 ఫ్రాంచైజీల్లో కలిపి 77 ఖాళీలు ఉండగా.. ఇందులో 30 విదేశీ క్రికెటర్ల స్థానాలు ఉన్నాయి. బీసీసీఐ అందజేసిన 1166 మంది ఆటగాళ్ల జాబితా నుంచి ఫ్రాంచైజీలు షార్ట్ లిస్ట్ చేయనున్నాయి. ఈ జాబితాను డిసెంబర్ 19న వేలం వేస్తారు. అయితే ఈ వేలంలో కొందరికి నిరాశే ఎదురవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లుగా.. యావత్ క్రికెట్ ప్రపంచం మన్ననలు అందుకున్నా.. కొందర్నీ ఫ్రాంచైజీలు పట్టించుకునే అవకాశం లేదు. ఒకసారి ఆ జాబితాపై లుక్కెద్దాం.

1. స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా బిగ్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్‌ గతేడాది అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు ఆడలేడనే విమర్శ అతనిపై ఉంది. దాంతోనే అతన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోవడం లేదు. ఈ సారి కూడా అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది.

IPL 2024 Auction: These Capped Players And Cricketers Who Might Go Unsold

2. కేదార్ జాదవ్: టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను కూడా అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. గతేడాది కూడా అతను అమ్ముడుపోని జాబితాలోనే నిలిచాడు. దాంతో కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ కూడా ప్రారంభించాడు. ఆర్‌సీబీ ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్ అవసరం ఉండటంతో కేదార్ జాదవ్‌ను సీజన్ మధ్యలో తీసుకుంది. కానీ అతను ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. దాంతో వేలంలోకి వదిలేసింది.

3. హనుమ విహారి: టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారిని కూడా ఎవరూ తీసుకునే అవకాశం లేదు. 2019 నుంచి అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా అన్‌సోల్డ్ లిస్ట్‌లో నిలుస్తున్నాడు.

4. చతేశ్వర్ పుజారా: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాను కూడా ఎవరూ పట్టించుకునే అవకాశం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై అతని అనుభవాన్ని గౌరవించినా.. గతేడాది పట్టించుకోలేదు. ఈ సారి కూడా అతను అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది.

ఈ నలుగురితో పాటు టీమిండియా వెటరన్ పేసర్ వరుణ్ ఆరోన్, షెహ్‌బాజ్ నదీమ్, ఉమేశ్ యాదవ్, ఏంజెలో మాథ్యూస్, డసన్ షనక, రాసీ వన్ డెర్ డస్సెన్, జయదేవ్ ఉనాద్కత్, టెంబా బవుమా, లిటన్ దాస్ అన్‌సోల్డ్ లిస్ట్ చేరే అవకాశం ఉంది.

Story first published: Sunday, December 10, 2023, 20:55 [IST]
Other articles published on Dec 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+