RCB retained and release list: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 11 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్రధాన పేసర్లతో పాటు స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లకు గుడ్‌బై చెప్పింది.
ఐపీఎల్ 2022 మెగా వేలం సందర్భంగా రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హర్షల్ పటేల్‌తో పాటు వానిందు హసరంగాలకు ఉద్వాసన పలికింది. గత సీజన్‌లో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమవడంతో పాటు ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటుండటంతో వారిని వదులుకుంది. ఆశ్చర్యకరంగా ప్రధాన పేసర్ జోష్ హజెల్ వుడ్‌తో పాటు మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లేలకు కూడా ఉద్వాసన పలికింది.

ఫిన్ అలెన్, వ్యాన్ పార్నెల్, సోను యాదవ్, అవినాశ్ సింగ్, సిద్దార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లకు గుడ్ బై చెప్పింది. 18 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు దినేశ్ కార్తీక్‌ను అంటిపెట్టుకోవడం విశేషం. 11 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ఆర్‌సీబీ దగ్గర రూ.40.75 కోట్ల పర్స్ మనీ వాల్యూ మిగిలింది. 10 ఫ్రాంచైజీల్లో ఆర్‌సీబీ దగ్గర్నే ఎక్కువ డబ్బులు ఉండటం విశేషం.
ట్రేడింగ్ ద్వారా స్పిన్ ఆల్‌రౌండర్ షెహ్‌బాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వదులుకున్న ఆర్‌సీబీ.. అతనికి బదులుగా మయాంక్ దగార్‌ను తీసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరకుండా ఆర్‌సీబీ ఇంటిదారి పట్టింది.
ఆర్‌సీబీ రిటైన్డ్ లిస్ట్:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ బాండేజ్, మయాంక్ దగార్(ట్రేడింగ్), వైశాక్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్.
ఆర్‌సీబీ రిలీజ్ లిస్ట్:
జోష్ హజెల్ వుడ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్ వెల్, డేవిడ్ విల్లే, వ్యాన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాశ్ సింగ్, సిద్దార్థ్ కౌట్, కేదార్ జాదవ్.