IPL 2024 Auction: ఈ ఆటగాళ్లకు భారీ ధర.. అశ్విన్ జోస్యం!
IPL 2024 వేలంలో భారీ ధర పలకబోయే ఆటగాళ్లను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేసాడు. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనా వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. అయితే వన్డే ప్రపంచకప్ 2023లో సత్తా చాటిన ఆటగాళ్లంతా భారీ ధర పలికే ఛాన్స్ ఉందని అశ్విన్ అంచనా వేసాడు.
రూ. 50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న న్యూజిలాండ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్(రూ. 2 కోట్లు), డారిల్ మిచెల్(రూ. కోటి), వానిందు హసరంగా(రూ.1.5 కోట్లు), హర్షల్ పటేల్(రూ. 2 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ. 2 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ. 40 లక్షలు), ప్యాట్ కమిన్స్(రూ. 2 కోట్లు), మిచెల్ స్టార్క్(రూ. 2 కోట్లు), గెరాల్డ్ కోయిట్జీ(రూ. 2 కోట్లు) భారీ ధర పలకుతారని అశ్విన్ అంచనా వేసాడు. ఇందులో చాలా మంది ఆటగాళ్లు భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో సత్తా చాటారు.

అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశాడు. దీనికి నా అంచనా కరెక్ట్ అవుతుందా? అని క్యాప్షన్ ఇచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2024 వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లతో పాటు 119 ఓవర్‌సీసీ ఆటగాళ్లు ఉన్నారు. ఇద్దరు అసోసియేట్ ఆటగాళ్లున్నారు.
మొత్తం 10 ఫ్రాంచైజీల్లో గరిష్టంగా 77 స్థానాలు ఉన్నాయి. ఓవర్‌సీస్ ఆటగాళ్లకు 30 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వేలంలో 23 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉండగా.. మరో 13 మంది రూ.1.5 కోట్ల కనీస ధరతో ఉన్నారు.
ఈ వేలంలో గుజరాత్ టైటాన్స్ దగ్గర అత్యధికంగా రూ. 38.15 కోట్ల పర్స్ మనీ ఉండగా.. అత్యల్పంగా రూ. 13.15 కోట్లు లక్నో సూపర్ జెయింట్స్ వద్ద ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications