IPL 2024 Auction: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ముగియడంతో ఐపీఎల్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఇప్పటికే క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ.. మినీ వేలానికి కార్యచరణను సిద్దం చేస్తోంది. డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 మినీ వేలం నిర్వహించేందుకు సమయాత్తం అవుతోంది. ముంబై వేదికగా ఈ మినీ వేలం జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆటగాళ్ల ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. ప్లేయర్స్ రిటెన్షన్, రిలీజ్ జాబితాలు అందజేసేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది. ఈ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిలీజ్, రిటైన్‌లకు సంబంధించిన పూర్తి జాబితాలను సమర్పించాలని ఆదేశించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ పనిని వేగవంతం చేశాయి.

ఇప్పటికే ఫ్రాంచైజీలకు సంబంధించిన రిలీజ్ ఆటగాళ్ల జాబితాలు నెట్టింట వైరల్‌గా మారాయి. టీమ్ వర్గాలు అందించిన సమాచారంతో నేషనల్ మీడియా అనేక కథనాలను ప్రచురిస్తోంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌తో పాటు రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్‌లను వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. సన్‌రైజర్స్ జట్టు వర్గాల సమాచారం మేరకు ఈ ఇద్దరితో పాటు ఆదిల్ రషీద్, అకీల్ హొస్సెన్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, సమర్థ్ వ్యాస్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దగార్‌లను వదులుకునేందుకు ఆరెంజ్ ఆర్మీ సిద్దమైంది.
ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న టీ నటరాజన్‌ను కూడా వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమైనట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టిన సన్‌రైజర్స్.. టీమ్‌ను కూడా పూర్తిగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.
టీమిండియా హెడ్ కోచ్‌గా పదవి కాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ ఆటగాళ్ల జాబితా..
హ్యారీ బ్రూక్- రూ. 13.25 కోట్లు
మయాంక్ అగర్వాల్- రూ. 8.25 కోట్లు
ఆదిల్ రషీద్- రూ. 2 కోట్లు
అకీల్ హొస్సెన్- రూ. కోటి