IPL 2024 Auction: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ముగియడంతో ఐపీఎల్ 2024 సీజన్ సందడి మొదలైంది. వచ్చే నెల 19న ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం జరగనుంది. ఈ వేలం కోసం ఫ్రాంచైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కూడా అప్‌కమింగ్ సీజన్ నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది.
వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌తో పాటు తమ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్‌ను వదులుకునేందుకు ఆర్‌సీబీ సిద్దమైంది. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో హర్షల్ పటేల్‌ను రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. గత రెండు సీజన్లలో అతను దారుణంగా విఫలమవడంతో వదులుకునేందుకు సిద్దమైంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవ్వడంతో పాటు గత సీజన్‌లో దారుణంగా విఫలమైన దినేశ్ కార్తీక్‌కు గుడ్ బై చెప్పనుంది. ఇప్పటికే షెహ్‌బాజ్ అహ్మద్‌ను ట్రేడింగ్ విండో ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇచ్చేసిన ఆర్‌సీబీ.. అనూజ్ రావత్, ఫిన్ అలెన్‌లను కూడా వదులుకోనుంది. మినీ వేలంలో సత్తా కలిగిన ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది.
ఇప్పటికే తమ హెడ్ కోచ్‌ను మార్చుకున్న ఆర్‌సీబీ.. జట్టును కూడా ప్రక్షాళన చేయడంపై ఫోకస్ పెట్టింది. టీమ్ డైరెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా సుదీర్ఘ కాలం పాటు పని చేసిన మైక్ హెస్సెన్‌కు గుడ్ బై చెప్పిన ఆర్‌సీబీ.. జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్‌ను కొత్త కోచ్‌గా నియమించుకుంది. గత సీజన్ వరకు ఆండీ ఫ్లవర్.. లక్నో సూపర్ జెయింట్స్ కోచ్‌గా పని చేశాడు.
నేటి(ఆదివారం)తో ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన ట్రేడింగ్ విండోతో పాటు రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించేందుకు బీసీసీఐ విధించిన గడువు ముగుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల రిటైన్, రిలీజ్ లిస్ట్‌లను విడుదల చేయనుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
హర్షల్ పటేల్- రూ. 10 కోట్లు
దినేశ్ కార్తీక్- రూ. 5.5 కోట్లు
అనుజ్ రావత్- రూ. 3.4 కోట్లు
ఫిన్ అలెన్- రూ. 80 లక్షలు
షెహ్‌బాజ్ అహ్మద్(ట్రేడింగ్)