IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలను బీసీసీఐకి సమర్పించాయి. ఈ జాబితాలను అందించేందుకు ఆదివారమే తుది గడువు కావడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను అందజేశాయి.
సాయంత్రం ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు ఈ జాబితాలను వెల్లడించాయి. ఆటగాళ్లను ట్రేడింగ్ విండోను డిసెంబర్ 12 వరకు ఓపెన్‌గా ఉంచడంతో కాస్త గందరగోళం నెలకొంది. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకున్న తర్వాత.. ముంబై ట్రేడ్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. జట్ల వారిగా వదులుకున్న ఆటగాళ్ల జాబితాపై ఓ లుక్కెద్దాం.

1. చెన్నై సూపర్ కింగ్స్:
బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండా మగలా
2. గుజరాత్ టైటాన్స్:
హార్దిక్ పాండ్యా(ముంబైకి), అల్జారి జోసెఫ్, ఒడియన్ స్మిత్, డసన్ షనక, యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సంగ్వాన్
3.ముంబై ఇండియన్స్:
మహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, జై రిచర్డ్‌సన్, రీలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్.
4. లక్నో సూపర్ జెయింట్స్:
డానియల్ సామ్స్, కరుణ్ నాయర్, జైదేవ్ ఉనాద్కత్, రొమారియో షెఫర్డ్(ముంబైలోకి), ఆవేశ్ ఖాన్(రాజస్థాన్‌లోకి), మనన్ వోహ్రా, కరణ్ శర్మ, సూర్యన్ష్, స్వప్నిల్, అర్పిత్
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
జోష్ హజెల్ వుడ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్ వెల్, డేవిడ్ విల్లే, వ్యాన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాశ్ సింగ్, సిద్దార్థ్ కౌట్, కేదార్ జాదవ్.
6. కోల్‌కతా నైట్‌రైడర్స్:
టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్, మణ్‌దీప్ సింగ్, కుల్వంత్, నారయణ్ జగదీశన్, డేవిడ్ వీజ్, ఆర్య దేశాయ్, లిటన్ దాస్, జాన్సన్ ఛార్లెస్, షకిబ్ అల్ హసన్
7. రాజస్థాన్ రాయల్స్:
జోరూట్, బాసిత్, జాసన్ హోల్డర్, దేవదత్ పడిక్కల్, ఆకాశ్ వశిష్ట్, కుల్‌దీప్ యాదవ్, మెకాయ్, ఎం అశ్విన్, కేసీ కరియప్పా, కేఎం ఆసిఫ్.
8. పంజాబ్ కింగ్స్:
షారూఖ్ ఖాన్, రాజ్ బవా, బల్తేజ్, మోహిత్ రథీ, భానుక రాజపక్స
9. ఢిల్లీ క్యాపిటల్స్:
రొసో, చేతన్ సకారియా, రోమన్ పావెల్, మనీశ్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్, నాగర్‌కోటి, రిపల్ పటేల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్.
10. సన్‌రైజర్స్ హైదరాబాద్:
హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, అకీల్ హోస్సెన్, మయాంక్ దగార్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్.