Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడీ గారూ.. సన్‌రైజర్స్ జట్టులోకి నన్నెందుకు తీసుకోలేదు సార్: అంబటి రాయుడు(వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ టామ్ మూడీ, టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌కు ఈ ఇద్దరూ కలిసి కామెంట్రీ చెప్పారు. ఈ సందర్భంగా రాయుడు.. టామ్ మూడీని నిలదీసాడు. తెలుగు ప్లేయర్ అయిన తనను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు.

'నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటను చూడటం ఇష్టపడుతాను. వాళ్లకు ప్రత్యర్థిగా ఆడటాన్ని కూడా ఆస్వాదించాను. తెలుగు ప్లేయర్‌గా హైదరాబాద్‌కు కూడా ఆడాలని అనుకున్నా. కానీ మీరు కోచ్‌గా ఉండి నన్ను ఎందుకు తీసుకోలేదు.?'అని రాయుడు ప్రశ్నించగా.. టామ్ మూడీ వివరణ ఇచ్చాడు.

IPL 2024 Ambati Rayudu ask Tom Moody over his selection for SRH

'మిమ్మల్ని పిక్ చేయడానికి మేం చాలా ప్రయత్నించాం. ఎందుకంటే మీరు కూడా ఇలాగే బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా కట్ షాట్స్ అద్భుతంగా ఆడేవారు. కానీ మీ హోమ్ స్టేట్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు మీకు కాలం కలిసి రాలేదు. అయితే హైదరాబాద్‌లో ఉన్న ఫాలోయింగ్‌కు మీ కెరీర్‌లో ఒక్కసారైనా ఆరెంజ్ జెర్సీలో ఆడుంటే బాగుండేది.'అని టామ్ మూడీ సమాధానమిచ్చాడు.

తన ఐపీఎల్ కెరీర్‌లో అంబటి రాయుడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు మాత్రమే ప్రాతినిథ్యం వహించాడు. ఇరు జట్ల తరఫున మొత్తం 6 సార్లు టైటిల్ గెలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్ విజయానంతరం ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు.

రాజకీయాల్లో కూడా అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందుల పాలయ్యాడు. ముందుగా వైఎస్సార్‌సీపీలో చేరిన అతను మళ్లీ యూటర్న్ తీసుకొని జనసేనలో చేరేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా సేవలందిస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో వ్యాఖ్యానం చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

Story first published: Wednesday, April 10, 2024, 23:07 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+