For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024 Auction: ఆ ముగ్గురుపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్‌ మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ సమయాత్తం అవుతోంది. ఇప్పటికే ట్రేడింగ్ విండో ద్వారా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్‌ నుంచి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతని కోసం భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్ఛర్‌లను వదులుకుంది.

ఈ ఇద్దర్నీ మినహా ప్రధాన ఆటగాళ్లందర్నీ ముంబై ఇండియన్స్ అంటిపెట్టుకుంది. మహమ్మద్ అర్షద్ ఖాన్, రమణ్‌దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టియన్ స్టబ్స్, డువాన్ యాన్సెన్, జై రిచర్డ్‌సన్, రీలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్ వంటి బ్యాకప్ ప్లేయర్లను మాత్రమే ముంబై ఇండియన్స్ వదిలేసింది.

IPL 2024: 3 Players MI Can Target in Upcoming IPL Auction

ఆ జట్టుకు ఓ ప్రధాన ఓవర్‌సీస్ పేసర్‌తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఓ ముగ్గురి ఆటగాళ్లపై ఫోకస్ పెట్టింది. జోఫ్రా ఆర్చర్ స్థానాన్ని ప్యాట్ కమిన్స్‌తో భర్తీ చేయాలనుకుంటోంది. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ వానిందు హసరంగాను.. పేస్ ఆల్‌రౌండర్ స్థానాన్ని జాసన్ హోల్డర్‌‌ను కొనుగోలు చేయాలనుకుంటోంది.

IPL 2024: 3 Players MI Can Target in Upcoming IPL Auction

ప్యాట్ కమిన్స్: ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2024 వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరంగా ఉన్న కమిన్స్.. ఐపీఎల్ 2022 వరకు కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. జోఫ్రా ఆర్చర్ స్థానాన్ని కమిన్స్‌తో భర్తీ చేసేందుకు కమిన్స్ కొనుగోలు చేయాలని ముంబై భావిస్తోంది. అతని కోసం భారీ ధర వెచ్చించేందుకు కూడా సిద్దంగా ఉంది. కానీ పర్స్ వాల్యూ రూ. 17.25 కోట్లు ఉండటమే ప్రతికూలంశం. కమిన్స్‌ను కొనుగోలు చేస్తే బుమ్రాతో కలిసి ఆ జట్టు బౌలింగ్ లైనప్ బలంగా మారనుంది.

IPL 2024: 3 Players MI Can Target in Upcoming IPL Auction

వానిందు హసంరగా: శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగా‌పై కూడా ముంబై ఇండియన్స్ కన్నేసింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న హసరంగా.. గత సీజన్‌లో మాత్రం విఫలమయ్యాడు. దాంతో అతన్ని ఆర్‌సీబీ వేలంలోకి వదిలేసింది. పైగా అతను ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ సమయానికి అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లోయరార్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు.

IPL 2024: 3 Players MI Can Target in Upcoming IPL Auction

జాసన్ హోల్డర్: పేస్ ఆల్‌రౌండర్ కోసం జాసన్ హోల్డర్‌ను కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. కీరన్ పోలార్డ్ లేని లోటు తీర్చాలనుకుంటోంది. జాసన్ హోల్డర్‌ను జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటింగ్ బలోపేతం అవుతుందని ఆ జట్టు భావిస్తోంది.

ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములనీ, నేహాల్ వధీర, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధవాల్, జేసన్ బెహ్రెండాఫ్, రొమేరియో షెఫర్డ్ (లక్నో నుంచి), హార్దిక్ పాండ్యా (జీటీ నుంచి)

Story first published: Sunday, December 3, 2023, 7:31 [IST]
Other articles published on Dec 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+