For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అంబటి రాయుడి రిప్లేస్‌మెంట్.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్, తెలుగు తేజం అంబటి రాయుడు.. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాడు.

ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా నిలిచిన రాయుడు మొత్తం 6 టైటిళ్లు అందుకున్నాడు. ముంబై తరఫున మూడు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మరో మూడు టైటిళ్లు గెలిచాడు. మిడిలార్డర్ బ్యాటర్‌గా రాయుడు చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రాయుడి రిటైర్మెంట్‌తో చెన్నైకి ఓ లోటు ఏర్పడింది. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు యువ ఆటగాళ్లను అన్వేషిస్తోంది.

IPL 2024

ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ 2024 మినీవేలంలో రాయుడి స్థానాన్ని భర్తీ చేసే ముగ్గురు ఆటగాళ్లను టార్గెట్ చేసింది. మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్‌లతో పాటు సౌతాఫ్రికా యువ ప్లేయర్ జనేమన్ మలాన్‌‌లపై కన్నేసింది.

1. మయాంక్ అగర్వాల్..
ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలంలో రూ.8.75 కోట్ల భారీ ధరకు మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ అతను ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు. 10 మ్యాచ్‌ల్లో 27 సగటుతో 270 రన్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అతన్ని సన్‌రైజర్స్ వదిలేయాలనుకుంటోంది. అతనే గనుక వేలంలోకి వస్తే చెన్నై కొనుగోలు చేయనుంది.

IPL 2024

రాయుడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మయాంక్ అగర్వాల్ సరైన ఆప్షన్ అని ఆ జట్టు భావిస్తోంది. ఒకవేళ అతను వేలంలోకి రాకుంటే ప్రియామ్ గార్గ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.

2. ప్రియాంక్ పాంచల్
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ప్రియాంక్ పాంచల్‌పై కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓ కన్నేసింది. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ తరఫున ప్రియాంక్ పాంచల్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2023 మినీవేలంలో అతనికి అవకాశం దక్కలేదు. ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

IPL 2024

దాంతో అతను అన్‌సోల్డ్ ప్లేయర్‌గా నిలిచిపోయాడు. కాస్త నెమ్మదిగా ఆడినా.. నిలకడగా ఆడే సామర్థ్యం ఉండటంతో రాయుడి రీప్లేస్‌మెంట్‌కు ప్రియాంక్ పాంచల్ సరైనోడని సీఎస్‌కే భావిస్తోంది.

జనెమన్ మలాన్..
సౌతాఫ్రికా యువ బ్యాటర్ జనెమన్ మలాన్‌ను కూడా సీఎస్‌కే తీసుకునే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో అతను పాల్గొనకున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తుండటంతో చెన్నై ఆసక్తికనబరుస్తోంది. అతని దూకుడైన బ్యాటింగ్ సీఎస్‌కే జట్టుకు కలిసిరానుంది.

IPL 2024:

అయితే వీదేశీ ప్లేయర్ కోటాలో నలుగురే ఆడే చాన్స్ ఉండటం జనెమన్ మలాన్ ఎంపికకు ప్రతికూలంగా మారనుంది. ఏదీ ఏమైనా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా సీఎస్‌కే యువ ఆటగాళ్లను టార్గెట్ చేయనుంది.

Story first published: Friday, June 30, 2023, 14:46 [IST]
Other articles published on Jun 30, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+