Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సహస్ర సమరంలో యశస్వీ శతకం.. ఒకే ఒక్కడిగా నయా చరిత్ర!

ముంబై: రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1000వ ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ ప్రత్యేకమైన మ్యాచ్‌లో సెంచరీ బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్స్‌లతో 124 పరుగులతో రాజస్థాన్ రాయల్స్‌కు 212 పరుగుల భారీ స్కోర్ అందించాడు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న యశస్వీ.. ఈ ఘనతను అందుకున్న నాలుగో అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో మనీశ్ పాండే అగ్రస్థానంలో ఉండగా.. రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్ యశస్వీ కన్నా ముందున్నారు.

Yashasvi Jaiswal becomes 4th youngest to score hundred in IPL

19 ఏళ్ల 253 రోజుల వయసులో మనీశ్ పాండే సెంచరీ బాదాడు. రిషభ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించగా.. పడిక్కల్ 20 ఏళ్ల 289 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. యశస్వీ జైస్వాల్ 21 ఏళ్ల 125 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీ అందుకున్నాడు. అండర్ -19 వరల్డ్‌కప్‌లో సెంచరీ బాదిన యశస్వీ.. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ‌లో డబుల్ సెంచరీలు నమోదు చేశాడు.

విజయ్ హజారే‌ ట్రోఫీలో సెంచరీ బాదిన యశస్వీ.. భారత్ ఏ తరఫున కూడా శతక్కొట్టాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కేకేఆర్ తరఫున సెంచరీ నమోదు చేయగా.. 1000వ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ శతకం సాధించడం గమనార్హం. ఈ అసాధారణ రికార్డులతో యశస్వీ జైస్వాల్‌పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఈ యువ క్రికెటర్‌ను కొనియాడుతున్నారు. టీమిండియా భవిష్యత్తు స్టార్ అని ప్రశంసిస్తున్నారు.

Story first published: Sunday, April 30, 2023, 22:50 [IST]
Other articles published on Apr 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+