చెత్త నిర్ణయాలే రాజస్థాన్ రాయల్స్ కొంపముంచాయి: వీరేంద్ర సెహ్వాగ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ఆ టీమ్‌మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. బుధవారం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే విధ్వంసకర బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్‌ను కాదని దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్‌లను ముందుగా బ్యాటింగ్ పంపండం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ ఓటమిని క్రిక్‌బజ్ షోలో విశ్లేషించిన సెహ్వాగ్.. టీమ్ డైరెక్టర్ కుమారా సంగక్కరతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్‌పై విమర్శలు గుప్పించాడు.

హెట్‌మైర్ చివర్లో బ్యాటింగ్ రావడం వల్ల ఎక్కువ బంతులు ఆడలేకపోయాడని చెప్పాడు. 'హెట్‌మైర్ ఎక్కువ బంతులు ఆడలేకపోయాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో ఆడే హెట్‌మైర్‌ను నెంబర్4 లేదా 5లో బ్యాటింగ్ పంపించాల్సింది. రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్ కంటే ముందే హెట్‌మైర్ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
పైగా అతను లెఫ్టాండర్ కూడా. అప్‌ది ఆర్డర్‌లో ఆడటం వల్ల మరిన్ని బంతులు ఆడే అవకాశం అతనికి దక్కేది. వెస్టిండీస్ తరఫున అతను నెంబర్ 4లోనే ఆడుతాడు. భారత్‌లో అతనికి ఓ సెంచరీ కూడా ఉంది. ఇక్కడి కండిషన్స్ అతనికి బాగా తెలుసు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా అదరగొట్టాడు. ఆ జట్టు ఫైనల్ చేరడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అతన్ని చాలా ముందుగా బ్యాటింగ్‌కు పంపించాల్సింది. హెట్‌మైర్ చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ముందుగా బ్యాటింగ్ వస్తే ఔటయ్యేవాడంటే.. తర్వాత వచ్చి అతను చేసిందేం ఉంది.
నాలుగో స్థానంలో అతను బ్యాటింగ్ వచ్చి ఉంటే కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్‌ను మరో ఓవర్ మిగిలి ఉండగానే గెలిపించేవాడు. కనీసం మరో రెండు ఓవర్లు ఆడే అవకాశం దక్కినా మ్యాచ్‌ను ముంగించేవాడు. హెట్‌మైర్ విషయంలో సంజూ శాంసన్, డైరెక్టర్ కుమార్ సంగక్కర ఘోర తప్పిదం చేశారు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications