Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: విరాట్ కోహ్లీ‌పై ఓ మ్యాచ్ నిషేధం.. డేంజర్ జోన్‌లో ధోనీ, హార్దిక్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోనున్నాడు. ఆర్‌సీబీ రెగ్యూలర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముకల గాయంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవ్వగా.. కోహ్లీ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.

కోహ్లీ తన సారథ్యంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు అందించాడు. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోతకు గురయ్యాడు. కోహ్లీ కన్నా ముందే స్లో ఓవర్ రేట్‌కు మొదటి తప్పిదంగా ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది.

Virat Kohli

తాత్కాలిక సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ కూడా స్లో ఓవర్ రేటును కొనసాగించడంతో మ్యాచ్ ఫీజులో 24 లక్షలు కోత వేయడంతో పాటు టీమ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కట్ చేస్తూ జరిమానా విధించింది. మరోసారి ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌కు గురైతే ఆ మ్యాచ్ కెప్టెన్‌గా వ్యవహరించే కెప్టెన్‌‌పై నిబంధనల ప్రకారం ఓ మ్యాచ్ నిషేధం పడుతోంది. ఫాఫ్ డుప్లెసిస్ ఇంకా పూర్తి కోలుకోనుందన కోహ్లీనే మరో రెండు మ్యాచ్‌ల వరకు సారథిగా కొనసాగే అవకాశం ఉంది. స్లో ఓవర్ రేట్‌కు కారణమైతే అతను ఓ మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

కోహ్లీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, లక్నో సారథి కేఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీళ్లంతా ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా చెల్లించుకున్నారు. మరో రెండుసార్లు ఇదే రిపీట్ అయితే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోనున్నారు.

ఈ జరిమానా, నిషేధంతో పాటు నిర్ణీత సమయంలోపూ ఎన్ని ఓవర్లు అయితే అన్ని ఓవర్ల పాటు సర్కిల్ బయట ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. విలువైన సమయాన్ని వృథా చేయవద్దని ఈ కఠిన నియమాలు తీసుకొచ్చారు. ఐసీసీ నిబంధనల ప్రకారం గంటకు 12 ఓవర్లు బౌలింగ్ చేయాలి. మైదానంలో జరిగే అనివార్య పరిస్థితల సమయాన్ని మినహాయించి స్లో ఓవర్ రేట్‌ను లెక్కిస్తారు.

Story first published: Wednesday, April 26, 2023, 20:39 [IST]
Other articles published on Apr 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+