Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: సిరాజ్ ఇంట్లో ఆర్‌సీబీ టీమ్ సందడి.. తరలివచ్చిన కోహ్లీ ఫ్యాన్స్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా తమ తదుపరి మ్యాచ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టీమ్ హైదరాబాద్‌కు చేరుకుంది. మే 18న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో లోకల్ ప్లేయర్, ఆర్‌సీబీ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. తన టీమ్‌కు ఆతిథ్యం ఇచ్చాడు. కొత్తగా నిర్మించిన తన ఇంటికి ఆర్‌సీబీ టీమ్ మొత్తాన్ని డిన్నర్‌కు ఆహ్వానించాడు.

విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో సహా పలువురు ఆర్‌సీబీ ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ సిరాజ్ ఇంటి వద్ద సందడి చేశారు. సిరాజ్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. హైదరాబాద్ ఫుడ్‌ను ఆస్వాదించారు. అయితే ఈ విషయం ఎవరికి తెలియకుండా సిరాజ్ కుటుంబం జాగ్రత్తపడినప్పటికీ..కోహ్లీ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు ఎగబడ్డారు.

Virat Kohli, Faf Du Plessis and RCBs players

మహమ్మద్ సిరాజ్ తన నూతన నివాసాన్ని ఫిల్మ్ నగర్‌లో నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. సిరాజ్ ఇంటివద్ద ఆర్‌సీబీ ఆటగాళ్ల సందడిని వీడియో తీసిన ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది.

ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా తమ జట్టును ఇంటికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు తిలక్ వర్మ.. ముంబై టీమ్‌ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు తిలక్ ఇంట్లో సందడి చేశారు.

రాజస్థాన్ రాయల్స్‌తో అదిరిపోయే విజయాన్నందుకు ఆర్‌సీబీ అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(మే18), గుజరాత్ టైటాన్స్(మే21)తో తలపడనుంది.

ఈ సీజన్‌లో హైదరబాదీ పేసర్ సిరాజ్.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ఆర్‌సీబీకి శుభారంభాన్ని అందిస్తున్నాడు.
ఇప్పటివరకు ఈ సీజన్‌‌లో సిరాజ్ 12 మ్యాచుల్లో 16 వికెట్ల పడగొట్టాడు.

Story first published: Tuesday, May 16, 2023, 9:46 [IST]
Other articles published on May 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+