IPL 2023: ఎట్ల ఉండేటోడివే కేన్ మామ.. కడుపు తరక్కుపోతుందే! (వీడియో)
హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడి సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద సిక్సర్‌ను ఆపే క్రమంలో కేన్ మామ తీవ్రంగా గాయపడ్డాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఆడిన భారీ షాట్‌ను సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని అద్భుతంగా అందుకున్న కేన్ విలియమ్సన్.. బౌండరీ లైన్ ధాటాననే విషయాన్ని గ్రహించి కింద పడే క్రమంలో బంతిని మైదానంలోకి విసిరేసాడు. కానీ నేలకు తాకే సమయంలో అతని కుడికాలు క్రాస్‌గా ల్యాండ్ కావడంతో తీవ్ర గాయమైంది. బంతి కూడా బౌండరీ లైన్‌ను తాకడంతో సిక్సర్ కాస్త ఫోర్‌గా మారింది.

బాధతో అతను విలవిల్లాడాడు. కాలు కింద పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ సపోర్టింగ్ స్టాఫ్ అతణ్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్‌తో నొప్పిని నివారించుకున్నాడు గానీ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగు పెట్టలేదు. అతనికి స్కానింగ్ నిర్వహించిన అనంతరం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దాంతో కేన్ మామ సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ అనూహ్య గాయంతో కేన్ మామ స్వదేశం పయనమయ్యాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న అతను ఊత కర్రల సాయంతో నడుస్తూ ఎయిర్ పోర్ట్‌లో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు తల్లడిల్లిపోతున్నాడు. 'ఎట్ల ఉండేటోడివే కేన్ మామ.. కడుపు తరక్కుపోతుందే'అని కామెంట్ చేస్తున్నారు. అతను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన కేన్ విలియమ్సన్‌ను ఆ జట్టు వదులుకోవడంతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకుండానే స్వదేశం పయనమయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న కేన్.. ఇలా గాయంతో ఆటకు దూరమవ్వడం గుజరాత్ టైటాన్స్‌తో పాటు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications