Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: అప్పుడు రాయుడు.. ఇప్పుడు తిలక్! అంబాని టీమ్‌కు అండగా తెలుగోడు!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌ను తెలుగు తేజం, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 నాటౌట్) ఘనంగా ప్రారంభించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. నెహాల్ వాదేర(21)తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తిలక్.. అర్షద్ ఖాన్‌తో కలిసి 8వ వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జోడించాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది 22 పరుగులు పిండుకున్నాడు.

IPL 2023: Then Rayudu now Tilak Verma, Mumbai Indians shines with telugu stars

ఆఖరి బంతికి అతను కొట్టిన హెలికాప్టర్ షాట్ ఇన్నింగ్స్‌కే హైలైట్. గతేడాది మెగా వేలంలో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయగా.. ఆ సీజన్‌లోనూ ఆకట్టుకున్నాడు. టాప్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ.. అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోర్లు అందించాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌లో 397 పరుగులు చేసి ముంబై తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అసాధారణ ప్రదర్శనతో ముంబై టీమ్‌లో విలువైన ఆటగాడిగా మారాడు.

అయితే ముఖేష్ అంబానికి చెందిన ముంబై ఇండియన్స్‌కు ఓ తెలుగు ప్లేయర్‌గా అండగా నిలవడం, అసాధారణ ప్రదర్శన కనబర్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో అంబటి రాయుడు ముంబై ఇండియన్స్‌లో ఇదే పాత్రను పోషించాడు. 2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 356 పరుగులతో ఆకట్టుకున్నాడు.

2017 వరకు ముంబైకే ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముంబై ఇండియన్స్ టైటిళ్లు గెలిచిన 2013, 2015 సీజన్లలో రాయుడు 265, 281 పరుగులతో రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.తాజాగా తిలక్ వర్మ కూడా అదే పాత్ర పోషిస్తుండటంతో అభిమానులు అతన్ని రాయుడితో పోలుస్తున్నారు. అంబాని టీమ్‌కు తెలుగోడే అండగా ఉంటున్నాడని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, April 2, 2023, 22:30 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+