హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. అసాధారణ ఆటతీరుతో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై ఐదో టైటిల్‌ను ముద్దాడింది.
ఇక టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ జట్టును అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్ ప్రకటించింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హెడెన్, భారత మాజీ పేసర్ శ్రీశాంత్, కేకేఆర్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్‌లు తమ అత్యుత్తమ జట్లను ప్రకటించారు.

ఇందులో మాథ్యూ హెడెన్ ఒక్కడే విరాట్ కోహ్లీకి చోటివ్వలేదు. 14 మ్యాచ్‌లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 639 పరుగులతో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయినా హెడెన్ తన బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్‌లో కోహ్లీని విస్మరించాడు. శ్రీశాంత్, కెవిన్ పీటర్సన్, వెంకటేశ్ అయ్యర్ మాత్రం కోహ్లీని ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా ఎంపిక చేశారు. హెడెన్ ఆర్‌సీబీ నుంచి ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కడికే అవకాశం కల్పించాడు.
మాథ్యూహెడెన్ బెస్ట్ ఐపీఎల్ 2023 ఎలెవన్:
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కెప్టెన్), రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
కెవిన్ పీటర్సన్ బెస్ట్ ఐపీఎల్ 2023 ఎలెవన్:
ఫాఫ్ డుప్లెసిస్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హెన్రీచ్ క్లాసెన్, రింకూ సింగ్, రషీద్ ఖాన్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, మతీష పతీరణ
శ్రీశాంత్ బెస్ట్ ఐపీఎల్ 2023 ఎలెవన్:
యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, నూర్ అహ్మద్
వెంకటేశ్ అయ్యర్ బెస్ట్ ఐపీఎల్ 2023 ఎలెవన్:
ఫాఫ్ డుప్లెసిస్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, ఆండ్రీ రస్సెల్, దీపక్ చాహర్.