Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: పవర్‌ఫుల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2023: Sunrisers Hyderabad Strength, Weakness and Playing XI Prediction

హైదరాబాద్: చెత్తాటతో గత సీజన్‌లో8 స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్..ఈసారి పవర్‌ఫుల్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు సీజన్లు దారుణంగా విఫలమవడంతో జట్టు ప్రక్షాళన చేసిన సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లను వదిలేసి.. పనికొచ్చే ఆటగాళ్లపై మినీ వేలంలో కోట్లు కుమ్మరించింది. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌లను కొనుగోలు చేసి బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది. ఆదిల్ రషీద్, మయాంక్ మార్కేండేలతో స్పిన్‌ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తమ ఫ్రాంచైజీకి టైటిల్ అందించిన ఎయిడెన్ మార్క్‌రమ్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది. గతంలో కంటే చాలా బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ ఈసారైన అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి. మార్క్‌రమ్ సారథ్యంలోని ఆరెంజ్ ఆర్మీ బలాలు, బలహీనతలపై ఓ లుక్కెద్దాం.

సన్‌రైజర్స్ బలాలు..

సన్‌రైజర్స్ బలాలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన బలం కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్. ఇటీవల కాలంలో అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అద్వితీయమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ కెప్టెన్సీతో పాటు సౌతాఫ్రికా టీ20 పగ్గాలు అందుకున్నాడు. మార్క్‌రమ్‌తో పాటు టీమ్ చాలా సమతూకంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌, రాహుల్ త్రిపాఠిలతో టీమ్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. ఉమ్రాన్ మాలిక్, నటరాజర్,భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్‌లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది. పైగా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉండటం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, ఫజలక్ ఫరూకీ‌లతో బ్యాకప్ కూడా బలంగానే ఉంది.

బలహీనతలు..

బలహీనతలు..

సన్​రైజర్స్​ పేపర్​పై బలంగానే కనపడుతున్నా.. జట్టులోని చాలా మందికి ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడటం తొలిసారి. హెన్రీచ్ క్లాసెన్, హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, ఆదిల్ రషీద్‌లు తొలిసారి సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హరీ బ్రూక్ అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా భారత్‌లో ఆడలేదు. బిగ్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ ఉన్నా.. అతను రషీద్ ఖాన్‌లా రాణించగలుగుతాడా? లేదా? అనేది సందేహం. అంతేకాకుండా భారత జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఫామ్‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గత సీజన్‌లో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఉమ్రాన్ మాలిక్ తన పేస్ అదరగొడుతున్న ధారళంగా పరుగులివ్వడం జట్టును కలవరపెట్టే అంశం. జట్టులో టీమిండియా స్టార్లు లేకపోవడం కూడా సన్‌రైజర్స్ అతిపెద్ద బలహీనత.

సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)

సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

ఇంపాక్ట్ ప్లేయర్లు: అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగీ, అన్‌మోల్ ప్రీత్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:

విదేశీ ప్లేయర్లు: ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లేన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ ఫరూఖీ, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హోస్సేన్

భారత ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కెండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దగర్, నితీశ్ కుమార్ రెడ్డి,అన్‌మోల్ ప్రీత్ సింగ్

Story first published: Tuesday, March 21, 2023, 16:39 [IST]
Other articles published on Mar 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+