
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) యూట్యూబ్ చానెల్‌కు హ్యాక్‌కు గురైంది. శుక్రవారం సన్‌రైజర్స్ తమ న్యూ కిట్ ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. కానీ ఆ తర్వాత 6 గంటల వ్యవధిలోనే 29 వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏ మాత్రం సంబంధం లేని ఈ వీడియోలను చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. గేమ్స్, సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌కు సంబంధించిన వీడియోలు కావడంతో యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.
శనివారం ఉదయం హ్యాకర్స్ తొలి వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో గేమ్‌ఫర్ నైట్ డౌన్‌లోడ్ లింక్‌తో పాటు చీట్స్ అండ్ కోడ్స్ షేర్ చేశారు. ఆ తర్వాత కూడా కొరెల్‌డ్రా, కాన్వ, అడోబ్ ప్రిమియర్‌కు సంబంధించిన లింక్స్‌ను షేర్ చేశారు. అయితే సైబర్ క్రైమ్ నేరస్థులే ఈ పని చేసినట్లు ఈ వీడియోలను చూస్తే అర్థమవుతోంది. అయితే హ్యాంకింగ్ సంబంధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఐపీఎల్ 2023 కోసం సిద్దమవుతున్న ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి ఎయిడెన్ మార్క్‌రమ్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను మార్క్‌రమ్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దాంతో మార్క్‌రమ్‌కు ప్రమోషన్ ఇస్తూ తమ ప్రధాన టీమ్ సారథ్య బాధ్యతలను అప్పగించింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలు ఎదురైనా.. జట్టులోని ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తనదైన సారథ్యంలో టీమ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఇక నాకౌట్ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా ముందుండి అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లోనూ తన వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 366 పరుగులతో పాటు 11 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు.

పాత పద్దతిలో ఐపీఎల్ 2023 సీజన్ జరగనుండటంతో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. 2019లో చివరిసారిగా ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరగ్గా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్-బిలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ గ్రూప్‌లోనే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో రెండు మ్యాచ్‌లు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 02న రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.