హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ హాజరైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ డగౌట్‌లో వైట్ డ్రెస్‌లో తళక్కుమని మెరిసింది. సన్ గ్లాసెస్‌తో బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించిన కావ్య మారన్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల చెత్త ప్రదర్శనతో కావ్య మారన్ బాధపడటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
కావ్య మారన్ కోసమైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ట్విటర్ వేదికగా కోరుతున్నారు. కావ్య పాప బాధపడటం చూస్తుంటే మనసు అదోలా ఉందని, నవ్వేలా ఆడాలని సన్‌రైజర్స్ టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు కంటే కావ్య మారన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆమె అందానికి కోట్ల సంఖ్యలో అభిమానులున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ అభిమానులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆమెను ఇష్టపడుతారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఓ అభిమాని ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని కావ్య మారన్‌ను ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సందడి చేసిన కావ్య పాప.. ఐపీఎల్ 2023 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌కు కూడా హాజరై తమ జట్టుకు మద్దతు తెలుపుతోంది. ఆమెను చూసేందుకే మైదానానికి వెళ్లే అభిమానులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. పేలవ బౌలింగ్‌తో ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది.
బ్యాటింగ్‌కు అడ్వాంటేజ్‌గా ఉన్న వికెట్‌పై రాజస్థాన్ రాయల్స్ త్రయం యశస్వీ జైస్వాల్(37 బంతుల్లో 9 ఫోర్లతో 54), జోస్ బట్లర్(22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54), సంజూ శాంసన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దాంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో సన్‌రైజర్స్ యార్కర్ల కింగ్ టీ నటరాజన్ కాస్త కట్టడి చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. తొలి ఓవర్‌లో 17 పరుగులిచ్చుకున్న నటరాజన్.. తర్వాత రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూఖీ రెండు, ఉమ్రాన్ మాలిక్ ఓ వికెట్ తీసినా ధారళంగా పరుగులిచ్చారు.