Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: కేన్ మామతో పాటు ఆ ముగ్గురిని వదిలేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!

IPL 2023: SRH To Release Kane Williamson And 3 Others From The Team

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా ఇంటిదారి పట్టింది.ఆడిన 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి వరుస ఓటములతోనే సీజన్‌ను ప్రారంభించిన హైదరాబాద్.. ఆ తర్వాత ఐదు వరుస విజయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ మళ్లీ వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసుకుంది.

ఈ సీజన్ సన్‌రైజర్స్ కలిసిరాకపోయినా ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అయితే మిగతా ఆటగాళ్లలో కొంతమంది స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. అతనితో పాటు మరో నలుగురిని సన్‌రైజర్స్.. అప్‌కమింగ్ సీజన్ ముందు వదిలేసే అవకాశం ఉంది.

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్

సుదీర్ఘకాలం జట్టును విజయ పథంలో నడిపిన డేవిడ్ వార్నర్‌ను కాదని కేన్ విలియమ్సన్‌పై నమ్మకం ఉంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీరని నష్టం జరిగింది. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలను విభేదించాడని వార్నర్‌ను పక్కనపెట్టేసిన సన్‌రైజర్స్.. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని మాత్రం తీసుకోలేకపోయింది.

కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. అతను 13 మ్యాచ్‌ల్లో 19.63 సగటుతో 216 పరుగులు మాత్రమే చేసాడు. బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్ర ఒత్తిడికి గురైన కేన్ మామ.. కెప్టెన్సీలో కూడా తడబడ్డాడు. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో కేన్ చెత్త కెప్టెన్సీ కారణంగానే సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కేన్ మామకు ఉద్వాసన పలకాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కేన్ తడబడుతున్నాడు.

అబ్దుల్ సమద్..

అబ్దుల్ సమద్..

విధ్వంసకర బ్యాట్స్‌మన్ అబ్దుల్ సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయాలనే ఆలోచనలో ఉంది. ఈ యువ హిట్టర్‌పై ఎంతో నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇచ్చినా అతను మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు, ఐపీఎల్ 2022 సీజన్‌ మెగావేలానికి ముందే ఈ యువ హిట్టర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చిన హైదరాబాద్.. ఆ తర్వాత పక్కనపెట్టేసింది. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో మరో అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదులు కోవడం ఉత్తమమని సన్‌రైజర్స్ భావిస్తోంది.

శ్రేయాస్ గోపాల్..

శ్రేయాస్ గోపాల్..

స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా శ్రేయాస్ గోపాల్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. అతను ఆశించిన రీతిలో రాణించకపోవడంతో వదిలేయాలనుకుంటుంది. అతనికి బదులు వాషింగ్టన్ సుందర్,జగదీష్ సుచిత్‌లనే ఎక్కువ అవకాశాలిచ్చింది. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శ్రేయాస్ గోపాల్ 11.33 ఎకానమీతో 34 పరుగులిచ్చాడు. ఓ వికెట్ తీసాడు. బ్యాటింగ్‌లోనూ 9 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్‌ను వదిలేసి హిట్టింగ్ సామర్థ్యం కలిగిన భారత ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

ఫజల్హాఖ్ ఫరూఖీ

ఫజల్హాఖ్ ఫరూఖీ

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఫజల్హాఖ్ ఫరూఖీని సైతం సన్‌రైజర్స్ వదిలేయాలనుకుంటుంది. ఐపీఎల్ మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేయడంతో ఫరూఖీ స్థాయి పెరిగింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు మ్యాచ్‌ల్లో 6 ఎకానమీతో 6 వికెట్లు తీసిన ఫరూఖీ.. వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. దాంతో సన్‌రైజర్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. అతను మాత్రం తుస్సుమనిపించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతను 9.16 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అనుభవలేమి కారణంగా మ్యాచ్ కీలక సమయంలోనూ తడబడ్డాడు. ఈ క్రమంలోనే అతనికి బదులు మంచి ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

Story first published: Wednesday, June 8, 2022, 9:50 [IST]
Other articles published on Jun 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+