
సీన్ అబాట్..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్‌ను సన్‌రైజర్స్ రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బీబీఎల్ అనుభవం , అక్కడి ప్రదర్శన ఆధారంగా సన్‌రైజర్స్ తీసుకోగా.. అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతను ఓవర్‌కు 11.75 చొప్పున 47 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్‌లోనూ ఏడు పరుగులు మాత్రమే చేసాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతనికి బదులు మంచి ఓవర్‌సీస్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా ఉమ్రాన్, భువీతో బలంగా ఉన్న ఫేస్ విభాగానికి పనికొచ్చే పేస్ ఆల్‌రౌండర్‌ను ఎంచుకోవాలనుకుంటుంది.

ఫజల్హాఖ్ ఫరూఖీ
అఫ్గానిస్థాన్‌కు చెందిన ఫజల్హాఖ్ ఫరూఖీని సైతం సన్‌రైజర్స్ వదిలేయాలనుకుంటుంది. ఐపీఎల్ మెగావేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని కొనుగోలు చేయడంతో ఫరూఖీ స్థాయి పెరిగింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడు మ్యాచ్‌ల్లో 6 ఎకానమీతో 6 వికెట్లు తీసిన ఫరూఖీ.. వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
దాంతో సన్‌రైజర్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. అతను మాత్రం తుస్సుమనిపించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అతను 9.16 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అనుభవలేమి కారణంగా మ్యాచ్ కీలక సమయంలోనూ తడబడ్డాడు. ఈ క్రమంలోనే అతనికి బదులు మంచి ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

శ్రేయాస్ గోపాల్..
స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా శ్రేయాస్ గోపాల్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. అతను ఆశించిన రీతిలో రాణించకపోవడంతో వదిలేయాలనుకుంటుంది. అతనికి బదులు వాషింగ్టన్ సుందర్,జగదీష్ సుచిత్‌లనే ఎక్కువ అవకాశాలిచ్చింది. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శ్రేయాస్ గోపాల్ 11.33 ఎకానమీతో 34 పరుగులిచ్చాడు. ఓ వికెట్ తీసాడు.
బ్యాటింగ్‌లోనూ 9 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్‌ను వదిలేసి హిట్టింగ్ సామర్థ్యం కలిగిన భారత ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

అబ్దుల్ సమద్..
విధ్వంసకర బ్యాట్స్‌మన్ అబ్దుల్ సమద్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వదిలేయాలనే ఆలోచనలో ఉంది. ఈ యువ హిట్టర్‌పై ఎంతో నమ్మకం ఉంచి వరుస అవకాశాలు ఇచ్చినా అతను మ్యాచ్‌ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు, ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి ముందే ఈ యువ హిట్టర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చిన హైదరాబాద్.. ఆ తర్వాత పక్కనపెట్టేసింది. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో మరో అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదులు కోవడం ఉత్తమమని సన్‌రైజర్స్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications












