IPL 2023: నాలుగేళ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ సందడి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదలైంది. 70 లీగ్ మ్యాచ్‌ల వివరాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ శుక్రవారం ప్రకటిచింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 2023 జరగనుండగా.. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. మే 28న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుంది. గతేడాది మాదిరే 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభించారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లను ఆడనుంది. గతంలో మాదిరిగానే హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకజట్టు తమ సొంత మైదానంలో ఏడు.. ప్రత్యర్థి జట్ల మైదానాల్లో మరో 7 మ్యాచ్‌లు ఆడనుంది.
నాలగేళ్ల తర్వాత..
కరోనా కారణంగా గత మూడేళ్లు.. పరిమిత వేదికల్లోనే బయో బబుల్‌లో ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు పడటంతో పాత పద్దతిని అనుసరించనున్నారు. దాంతో హైదరాబాద్ వేదికగా మళ్లీ ఐపీఎల్ సందడి మొదలు కానుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. 2019లో చివరిసారిగా ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరగ్గా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఏప్రిల్ 2న తొలి మ్యాచ్..
గ్రూప్-బిలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ గ్రూప్‌లోనే ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్-ఏలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో రెండు మ్యాచ్‌లు, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 02న రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 షెడ్యూల్ :
| తేది | ప్రత్యర్థి | వేదిక |
| ఏప్రిల్ 02 | సన్‌రైజర్స్ vs రాజస్తాన్ రాయల్స్ | హైదరాబాద్ |
| ఏప్రిల్ 07 | సన్‌రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ | లక్నో |
| ఏప్రిల్ 09 | సన్‌రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ | హైదరాబాద్ |
| ఏప్రిల్ 14 | సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడ | కోల్‌కతా |
| ఏప్రిల్ 18 | సన్‌రైజర్స్ vs ముంబై | హైదరాబాద్ |
| ఏప్రిల్ 21 | సన్‌రైజర్స్ vs చెన్నై | చెన్నై |
| ఏప్రిల్ 24 | సన్‌రైజర్స్ vs ఢిల్లీ | హైదరాబాద్ |
| ఏప్రిల్ 29 | సన్‌రైజర్స్ vs ఢిల్లీ | ఢిల్లీ |
| మే 04 | సన్‌రైజర్స్ vs కోల్‌కతా | హైదరాబాద్ |
| మే 07 | సన్‌రైజర్స్ vs రాజస్తాన్ | జైపూర్ |
| మే 13 | సన్‌రైజర్స్ vs లక్నో | హైదరాబాద్ |
| మే 15 | సన్‌రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ | అహ్మదాబాద్ |
| మే 18 | సన్‌రైజర్స్ vs బెంగళూరు | హైదరాబాద్ |
| మే 21 | సన్‌రైజర్స్ vs ముంబై | ముంబై |
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications