For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: మినీ వేలం తర్వాత డేంజరస్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్టు అంచనా ఇదే!

IPL 2023: SRH’s strongest playing 11 after Mini Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లకు 6 మాత్రమే గెలిచి 8వ స్థానంతో సరిపెట్టుకుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఆరెంజ్ ఆర్మీ.. కేన్ విలియమ్సన్‌తో సహా 12 మంది ఆటగాళ్లను వదిలేసి.. పనికొచ్చే ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది.

మయాంక్ అగర్వాల్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్‌లను కొనుగోలు చేసి బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది. ఆదిల్ రషీద్, మయాంక్ మార్కేండేలతో స్పిన్‌ విభాగాన్ని పటిష్టం చేసుకుంది. పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్.. స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ లుక్కెద్దాం.!

ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ

ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ

సరైన ఓపెనింగ్ జోడీ లేక ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ మూల్యం చెల్లించుకుంది. అభిషేక్ శర్మ పర్వాలేదనిపించినా... అతనికి జోడీగా కేన్ విలియమ్సన్ రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్ కోసం వేలంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది.

అభిషేక్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో మయాంక్ విఫలమైనా.. తనదైన రోజున మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. జట్టులో ఏ స్ధానంలోనైనా అతను ఆడేందుకు సిద్దంగా ఉంటాడు. గత సీజన్‌లో అంచనాలను అందుకున్న అభిషేక్ శర్మ.. అదే జోరు కొనసాగించాల్సి ఉంది.

మిడిలార్డర్‌లో రాహుల్, మార్క్‌రమ్, హరీ బ్రూక్..

మిడిలార్డర్‌లో రాహుల్, మార్క్‌రమ్, హరీ బ్రూక్..

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన ఏకైక బ్యాటర్ రాహుల్ త్రిపాఠి. 14 మ్యాచ్‌ల్లో 413 పరుగులు చేసి టీమ్ తరఫున హయ్యెస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. నెంబర్3 స్థానంలో బరిలోకి దిగి దుమ్మురేపాడు. అప్‌కమింగ్ సీజన్‌లోనూ అతనే మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నాడు. త్రిపాఠి తర్వాత రాణించింది ఎయిడెన్ మార్క్‌రమ్.

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 14 మ్యాచ్‌ల్లో 381 రన్స్ చేశాడు. మిడిల్ ఓవర్లలో ఫైర్ ఫవర్ చూపెట్టిన ప్లేయర్. అప్‌కమింగ్ సీజన్‌లోనూ ఈ సౌతాఫ్రికా బ్యాటర్ రోల్ కూడా ఇదే. రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హరీ బ్రూక్ ఐదో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మిడిలార్డర్ బ్యాటర్‌గా మంచి రికార్డు ఉన్న హరీ బ్రూక్.. ఫినిషర్‌ రోల్ పోషిస్తాడని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

కీపర్ క్లాసెన్.. ఆల్‌రౌండర్ సుందర్

కీపర్ క్లాసెన్.. ఆల్‌రౌండర్ సుందర్

సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగనున్నాడు. కీపింగ్‌తో పాటు జట్టుకు కావాల్సిన ఫినిషింగ్ టచ్ ఇస్తాడని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ ఏడాది టీ20ల్లో సూపర్ ఫామ్‌ కనబర్చిన క్లాసెన్.. 155 స్ట్రైక్‌రేట్‌తో 238 రన్స్ చేశాడు. ఫైనల్ ఓవర్లలో వేగంగా ఆడగలడనే క్లాసెన్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది. ఏకైక ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌కు డోకా లేదు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తా చాటగల సుందర్ జట్టుకు చాలా కీలకం కానున్నాడు.

బౌలింగ్..భువీ, రషీద్, నటరాజన్, ఉమ్రాన్

బౌలింగ్..భువీ, రషీద్, నటరాజన్, ఉమ్రాన్

భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. టీ20ల్లో ఎంతో అనుభవం ఉన్న భువీ జట్టుకు కీలకం కానున్నాడు. అతనికి తోడుగా పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, యార్కర్ల కింగ్ నటరాజన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఉమ్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత చాలా షైన్ అయ్యాడు. అయితే అతన్ని పరిస్థితులకు తగ్గట్లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. గాయాలతో నటరాజన్ ప్రభావం తగ్గినా.. కచ్చితమైన యార్కర్లు వేయడంలో అతనికి తిరుగులేదు. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ నట్టూ కెరీర్‌కు కీలకం కానుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ ఆడటం ఖాయం. టీ20 ప్రపంచకప్‌లో రషీద్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది 24 టీ20ల్లో 7.50 ఎకానమీతో 23 వికెట్లు తీసాడు.

సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)

సన్‌రైజర్స్ తుది జట్టు(అంచనా)

మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హరీ బ్రూక్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు: అబ్దుల్ సమద్,ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజలక్ ఫరూఖీ, కార్తీక్ త్యాగీ, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రీచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కెండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దగర్, నితీశ్ కుమార్ రెడ్డి, అకీల్ హొస్సెన్, అన్‌మోల్ ప్రీత్ సింగ్

Story first published: Monday, December 26, 2022, 15:10 [IST]
Other articles published on Dec 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+