
కెప్టెన్సీకి సరైనోడని..
సమర్థవంతమైన కెప్టెన్‌తో పాటు ఆల్‌రౌండర్లను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సత్తా చాటిన బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లపై సన్‌రైజర్స్ కన్ను పడినట్లు సమాచారం. ముఖ్యంగా బెన్ స్టోక్స్‌ను తీసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. అతని కోసం ఎంత ధర అయిన చెల్లించేందుకు సన్‌రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా బెన్ స్టోక్స్‌కే సన్‌రైజర్స్ సారథ్య బాధ్యతలు అప్పగించాలని టీమ్ ఓనర్ కావ్య మారన్ నిర్ణయించినట్లు ఆరెంజ్ ఆర్మీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. బిగ్ మ్యాచ్ విన్నర్ అయిన బెన్ స్టోక్స్‌ను తీసుకుంటే బౌలింగ్, బ్యాటింగ్ బలోపేతం అవడంతో పాటు కెప్టెన్సీ సమస్య కూడా తీరుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు.

అదొక్కటే సమస్య..
పాకిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బెన్ స్టోక్స్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసిన అతను కెరీర్‌లో తొలి టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసి ఇంగ్లండ్‌కు రెండో టీ20 ప్రపంచకప్ అందించాడు. అయితే భారీ పర్స్ మనీ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు స్టోక్స్‌ను తీసుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
కానీ ఇతర ఫ్రాంచైజీలు కూడా స్టోక్స్‌ను తీసుకునేందుకు వేలంలో తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. హైదరాబాద్ పర్స్ మనీని ఖాళీ చేసేందుకు వ్యూహాత్మకంగా భారీ ధర పలికేలా వేలంలో పోటీకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సరైన కోర్ టీమ్ లేని సన్‌రైజర్స్ మళ్లీ అనామక ఆటగాళ్లతో మిగతా స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టోక్స్ విషయంలో సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది.

కెప్టెన్‌తో పాటు కీపర్..
ఇక ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్‌లను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్.. కేన్ మామతో పాటు నికోలస్ పూరన్, రొమారియో షెఫర్డ్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్‌లను వదిలేసింది. బౌలింగ్ విభాగం ఉన్నా.. ఓపెనర్, వికెట్ కీపర్‌తో పాటు ఆల్‌రౌండర్లను సన్‌రైజర్స్ తీసుకోవాల్సి ఉంది. బ్యాకప్ ప్లేయర్లను ఎంచుకోవాల్సి ఉంది. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది.


Click it and Unblock the Notifications
