Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: శతక్కొట్టిన ‌సన్‌రైజర్స్ స్టార్.. పూనకాలు లోడింగ్.. అంటూ ఫ్యాన్స్ రచ్చ!

IPL 2023: SRH fans happy with Mayank Agarwal scores third century in Ranji Trophy

బెంగళూరు: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2023లో కర్ణాటక కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్(246 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 110 బ్యాటింగ్) మరో సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో మయాంక్ అగర్వాల్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. స్టార్ ప్లేయర్లు దేవదత్ పడిక్కల్(9), మనీశ్ పాండే(7)లు విఫలమైనా.. శ్రీనివాస్ శరత్(58 బ్యాటింగ్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 117 పరుగులు జోడించడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 229 పరుగులు చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా ఓ వికెట్ పడగొట్టాడు.

పేలవ ఫామ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయిన మయాంక్ అగర్వాల్.. తాజా రంజీ సీజన్‌లో అదరగొట్టాడు. మొత్తం మూడు సెంచరీలతో 79.60 యావరేజ్‌తో 796 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు మయాంక్ అగర్వాల్ ఫామ్‌లోకి రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మయాంక్ అగర్వాల్ సెంచరీ చేసిన విషయాన్ని తెలియజేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేయగా.. ఫ్యాన్స్ అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పూనకాలు లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదే ఫామ్‌ ఐపీఎల్‌లో కొనసాగిస్తే సన్‌రైజర్స్ టైటిల్ గెలవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. వెంటనే మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

గత కొన్ని సీజన్లుగా సరైన భారత బ్యాటర్ లేక ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సారి ఆ సమస్యను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్.. మయాంక్‌ను దక్కించుకుంది. ఓపెనింగ్‌తో పాటు కెప్టెన్‌గా పనికొస్తాడనే సన్‌రైజర్స్ మయాంక్ కోసం తీవ్రంగా పోటీపడింది.

కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న సన్‌రైజర్స్.. మయాంక్ అగర్వాల్‌ను తమ తదుపరి కెప్టెన్‌గా నియమించుకోవాలనుకుంటుంది. అతనికి ఎయిడెన్‌ మార్క్‌రమ్, భువనేశ్వర్ కుమార్, అభిషేక్ శర్మల నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఓనర్ కావ్యమారన్, హెడ్ కోచ్ బ్రియాన్ లారా మయాంక్ అగర్వాల్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, February 8, 2023, 20:35 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+