Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: వాడు వీరుడా? ఈ ఎక్స్‌ట్రాలే ఆపి ఆ ఇద్దరిపై ఫోకస్ చేయండి.. సన్‌రైజర్స్‌కు ఫ్యాన్స్ వార్నింగ్!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. మినీవేలానికి ముందు 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ.. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు నికోలస్ పూరన్‌పై వేటు వేసింది. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర అత్యధికంగా రూ.42.25 కోట్ల పర్స్ మనీ ఉంది. ఈ డబ్బులతో మినీ వేలంలో మంచి ఆటగాళ్లను ఆ జట్టు తీసుకోవచ్చు. ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్లక్ ఫరూఖీలను రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్.. సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకర్షించే పని మొదలుపెట్టింది.

వాడు వీరుడేంది..?

ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. 'వీర శూర'అనే తెలుగు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోకు మంచి మ్యూజిక్ యాడ్ చేసింది. అయితే ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు అభిషేక్ శర్మకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో తమకు అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అతని వల్ల జట్టుకు కలిగిన ఉపయోగం ఏం లేదని, గత మెగా వేలంలో కూడా డేవిడ్ వార్నర్ కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశారని మండిపడుతున్నారు.

ఆ ఇద్దరిని కొనుగోలు చేయండి..

ఈ ఎక్స్‌ట్రాలే ఆపి.. మినీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనగోలు చేయడంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్స్ బెన్ స్టోక్స్, సామ్ కరణ్‌లలో ఒకరిని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా భారత ఆటగాళ్లపై కూడా ఫోకస్ పెట్టాలని, టాపార్డర్ బ్యాటర్లను తీసుకోవాలని సలహాలిస్తున్నారు. సరైన ఓపెనర్లతో పాటు మంచి మిడిలార్డర్ బ్యాటర్లను కొనుగోలు చేయాలంటున్నారు. వీలైతే కేన్ మామను మళ్లీ తీసుకోవాలని.. ఇతర ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లకు ఎలా మద్దతుగా ఉంటున్నాయో అలా ఉండాలని పేర్కొంటున్నారు.

అభిషేక్ శర్మతో ఏమైనా ఎఫైరా?

కొందరైతే అభిషేక్ శర్మను హైలైట్ చేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వానితో కావ్యమారన్‌కు ఏమైనా ఎఫైర్ ఉందా? అంటూ జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే బెడ్ రూమ్‌లో చూసుకోవాలని, జట్టు పేరు చెప్పి తమపై రుద్దు వద్దని మండిపడుతున్నారు. వాడికంటే మయాంక్ అగర్వాల్ నయమని అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 23న మినీ వేలం జరగనుండగా ఫ్రాంచైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి.

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:

ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా

కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

Story first published: Thursday, November 17, 2022, 13:21 [IST]
Other articles published on Nov 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+