For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లోకి సౌరవ్ గంగూలీ రీఎంట్రీ.. దాదాకు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పదవి!

IPL 2023: Sourav Ganguly set to head of all cricket for Delhi Capitals

న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, టీమిండియా దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అప్‌కమింగ్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఫ్రాంచైజీ వర్గాలు పేర్కొన్నాయని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు సౌరవ్ గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా, మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందించనున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా..

ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా..

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో పాటు ఆ ఫ్రాంచైజీకి చెందిన ఐఎల్‌టీ20 (ఇంటర్నేషనల్ లీగ్ టీ20)లోని దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికాటీ20 లీగ్‌‌లోని ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్‌లకు కూడా దాదా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడని ఆ ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపాడు.'అవును, సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రాబోతున్నారు. ఆయనతో జరుపుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో ఆయన పనిచేశారు. ఈ ఫ్రాంఛైజీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆయన్ని ఒప్పించాం.' అని సదరు అధికారి వెల్లడించాడు.

పంత్‌కు ప్రమాదం..

పంత్‌కు ప్రమాదం..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం ఆ ఫ్రాంచైజీకి పెద్ద తలనొప్పిగా మారింది. డిసెంబర్ 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పంత్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కొత్త సంవత్సరం కోసం స్వస్థలం అయిన రూర్కీకి ఒక్కడే కారులో బయలు దేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్ రేలింగ్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమవ్వగా.. ఓ బస్సు డ్రైవర్ సాయంతో పంత్ ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ ప్రమాదంలో అతని మొకాలి లింగ్మెంట్స్‌లో ఫ్రాక్షర్ రావడంతో పాటు బొటన వేలు, మడిమ, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. దాంతో అతను 6 నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.

కెప్టెన్ ఎవరా..?

కెప్టెన్ ఎవరా..?

ఐపీఎల్ 2023 సీజన్‌కు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఇదే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన సమస్యగా మారింది. రిషభ్ పంత్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయడం ఆ జట్టు ముందు సవాల్‌గా మారింది. రిషబ్ పంత్ ప్లేస్‌లో డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ అప్పగిస్తారా? లేక అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. పాంటింగ్ కోచింగ్, సౌరవ్ గంగూలీ గైడెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ పనిచేయనుంది.

బీసీసీఐ నుంచి బలవంతంగా..

బీసీసీఐ నుంచి బలవంతంగా..

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో‌నూ ఐపీఎల్‌‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్‌లను దుబాయ్ వేదికగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. 2022లో కొత్త ఫ్రాంఛైజీలను తీసుకొచ్చి, 2023-27 ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఖజానాలో నింపాడు. అయితే జట్టు మార్పుల విషయంలో సౌరవ్ గంగూలీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొట్టడంతో అతన్ని అధ్యక్ష పదవి నుంచి దింపేసారు.

Story first published: Tuesday, January 3, 2023, 17:38 [IST]
Other articles published on Jan 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+