Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పిన శుభ్‌మన్ గిల్.. ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌‌లోకి..!

 IPL 2023: Shubman Gill leaves Gujarat Titans

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఊహించని షాకిచ్చాడు. అప్‌కమింగ్ సీజన్‌లో గుజరాత్ తరఫున ఆడలేనని చెప్పాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్సే ట్విటర్ వేదికగా ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. తమ జట్టుతో కొనసాగిన అతని ప్రయాణం అద్భుతమని ప్రశంసించింది. 'శుభ్‌మన్ నీ ప్రయాణం గుర్తించుకోదగినది. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం'అని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌కు శుభ్‌‌మన్‌ సైతం లవ్ యూ అనే ఏమోజీతో బదులిచ్చాడు. అయితే అభిమానులు మాత్రం ఈ ప్రకటనను నమ్మటం లేదు. ఇది ప్రాంక్ అని పేర్కొంటున్నారు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అయ్యే శు‌భ్‌మన్ గిల్‌ను గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం వదలుకోదని, పైగా ఆ జట్టు టైటిల్ గెలవడంలో శుభ్‌మన్ కీలక పాత్ర పోషించాడని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాంక్‌లు చాలా చూశామని బదులిస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ట్రేడింగ్ ద్వారా శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో ముఖేష్ అంబానీ లోపకాయిరి ఒప్పందం చేసుకున్నాడని, బిజినెస్ పరంగా ఆశ చూపి శుభ్‌మన్ గిల్‌ను తన జట్టులోకి లాగేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు గిల్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఇక 16 మ్యాచ్‌ల్లో 132.33 స్ట్రైక్‌రేట్‌తో గిల్ 483 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 96.

Story first published: Saturday, September 17, 2022, 17:31 [IST]
Other articles published on Sep 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+