
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 70 మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించింది. మార్చి 31న ప్రారంభం కానున్న భారత క్యాష్ రిచ్ లీగ్.. మే 21న ముగియనుంది. పాత పద్దతిలో హోమ్ అవే ఫార్మాట్‌లో ఐపీఎల్ 2023 సీజన్‌ను నిర్వహించనున్నారు. మొత్తం 70 మ్యాచ్‌ల్లో 18 డబుల్ హెడర్స్‌ను షెడ్యూల్ చేశారు. ప్రతీ జట్టు సొంతమైదానంలో 7 మ్యాచ్‌లు.. అవే వేదికల్లో మరో 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. గుజరాత్ టైటాన్స్‌ను హార్డిక్ పాండ్యా నడిపిస్తుండగా.. చెన్నై టీమ్‌కు ధోనీ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో గురు-శిష్యుల మధ్య తొలి పోరు జరగనుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్-ఏలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్-బిలో ఉన్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో ఉన్న జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుండగా.. అపోజిట్ గ్రూప్‌లో సేమ్ పొజిషన్‌లో ఉన్న జట్టుతో రెండు మ్యాచ్‌లు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. గతేడాది కూడా ఇదే తరహాలో మ్యాచ్‌లు జరగాయి. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఏప్రిల్ 1న మ్యాచ్ జరగనుండగా.. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అదే జోజు రెండో మ్యాచ్ జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య ఏప్రిల్ 2న తొలి మ్యాచ్ జరగనుంది.
| 31-03-23 | Fri | Gujarat Titans vs ChennaiSuper Kings | Ahmedabad | 7:30:00 PM |
| 01-04-23 | Sat | Punjab Kings vs Kolkata Knight Riders | Mohali | 3:30:00 PM |
| 01-04-23 | Sat | Lucknow Super vs Giants Delhi Capitals | Lucknow | 7:30:00 PM |
| 02-04-23 | Sun | Sunrisers Hyderabad vs Rajasthan Royals | Hyderabad | 3:30:00 PM |
| 02-04-23 | Sun | Royal Challengers vs Bangalore MumbaiIndians | Bengaluru | 7:30:00 PM |
| 03-04-23 | Mon | Chennai Super Kings vs Lucknow Supe | Chennai | 7:30:00 PM |
| 04-Aor-23 | Tue | Delhi Captials vs Gujarat Titans | Delhi | 7:30:00 PM |
| O5-Apr-23 | Wed | Rajasthan vs Rovals Puniab Kines | Guwahati | 7:30:00 PM |
| 06-Aor-23 | Thu | Kolkata Knieht Ride vs Roval Challen2e | Kolkata | 7:30:00 PM |
| 07-04-23 | Fri | Lucknow Super Giants vs Sunrise | Lucknow | 7:30:00 PM |