Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు: సామ్ కరణ్

లక్నో: గాయం కారణంగానే శిఖర్ ధావన్ ఆడటం లేదని పంజాబ్ కింగ్స్ తాత్కలిక కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌‌కు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. దాంతో సామ్ కరణ్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శిఖర్ ధావన్ గాయపడ్డాడని, అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదన్నాడు. అయితే వీలైనంత త్వరగా ధావన్ బరిలోకి దిగుతాడని ఆశిస్తున్నామని చెప్పాడు. శిఖర్ ధావన్ లేకపోవడం తమ జట్టుకు గట్టి ఎదురుదెబ్బని సామ్ కరణ్ అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్ దూరమవడంతో జట్టులోకి ఇద్దరూ ఇండియన్ బ్యాటర్లు వచ్చారని, సికిందర్ రాజా కూడా తుది జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

Shikhar Dhawan Not Playing For PBKS

డ్యూ ఉండటంతో పాటు పిచ్ కండిషన్స్ బౌలింగ్ అనుకూలంగా ఉన్నాయనే చేజింగ్‌కు మొగ్గు చూపానని సామ్ కరణ్ స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లో మేం టాస్ గెలవడం ఇదే తొలిసారని చెప్పాడు.

ఈ వికెట్‌పై తొలి మ్యాచ్ అని చెప్పిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఏదైనా జరుగొచ్చన్నాడు. విభిన్నమైన కండిషన్స్‌లో తమ సామర్థ్యానికి అసలు సిసలు సవాల్‌గా ఈ మ్యాచ్ నిలుస్తుందని తెలిపాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టోర్నీని ఆస్వాదిస్తున్నారని, అభిమానుల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని చెప్పాడు.

తుది జట్లు:

లక్నో: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కెప్టెన్), ఆయూష్ బదోని, యుధ్‌విర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్

పంజాబ్ కింగ్స్: అథర్వ తైదే, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికిందర్ రాజా, జితేశ్ శర్మ(కీపర్), షారుఖ్ ఖాన్, సామ్ కరణ్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Saturday, April 15, 2023, 19:39 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+