Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: గతంలో కంటే పటిష్టంగా ఆర్‌సీబీ? తుది జట్టు అంచనా ఇదే!

 IPL 2023: Royal Challengers Bangalore Strength, Weakness and Playing XI Prediction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తృటిలో టైటిల్ కోల్పోయింది. 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఆర్‌సీబీ.. క్వాలియఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టైటిల్ అందుకోలేకపోయినా.. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. దాంతోనే మినీ వేలంలో కోర్ టీమ్‌ మొత్తాన్ని రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. బ్యాకప్ ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేసింది. వేలంలో కూడా కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది.

ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లకు తీసుకోగా.. అతను గాయంతో దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకుంది. టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, అవినాశ్ సింగ్, సోను యాదవ్ వంటి అనామక ఆటగాళ్లను కూడా తీసుకుంది. గతంలో కంటే చాలా బలంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ ఈసారైన అభిమానులను అలరిస్తుందో లేదో చూడాలి. ఆర్‌సీబీ బలాలు, బలహీనతలపై ఓ లుక్కెద్దాం.

ఆర్‌సీబీ టీమ్ బలాలు..

ఆర్‌సీబీ టీమ్ బలాలు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్, బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీ ఫాప్ డుప్లెసిస్ రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్‌లో హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్‌లతో పాటు వానిందు హసరంగాలతో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత సీజన్‌లో రజత్ పటీదార్ రూపంలో ఆ జట్టుకు సూపర్ స్టార్ దొరికాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ చేరిక కూడా జట్టుకు అడ్వాంటేజ్‌గా మారనుంది. ఇక కెప్టెన్ డుప్లెసిస్ కూడా టీమ్‌కు సానుకూలంశం.

ఆర్‌సీబీ బలహీనతలు

ఆర్‌సీబీ బలహీనతలు

జట్టులో స్టార్లున్నా .. వారు నిలకడగా రాణిస్తారా? లేదా? అనేది సందేహంగా మారింది. ముఖ్యంగా టీమిండియాకు దూరమైన దినేశ్ కార్తీక్.. గత సీజన్ మాదిరి మెరుపులు మెరిపిస్తాడా? అనేది చూడాలి. అంతేకాకుండా కాలి గాయంతో చాలా రోజులు ఆటకు దూరమైన గ్లేన్ మ్యాక్స్‌వెల్ రాణించడంపై కూడా సందేహాలున్నాయి. జట్టులో ప్రొఫెషనల్ ఓపెనర్ లేకపోవడం కూడా లోటే. యుజ్వేంద్ర చాహల్ లాంటి భారత స్పిన్నర్లు జట్టులో లేకపోవడం కూడా బలహీనతగా మారనుంది. ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న జోష్ హజెల్ వుడ్ రాణించడంపై కూడా సందేహాలున్నాయి.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగా/మైఖేల్ బ్రేస్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్

 ఆర్‌సీబీ పూర్తి జట్టు:

ఆర్‌సీబీ పూర్తి జట్టు:

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాశ్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, వానిందు హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, కర్న్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, మైఖేల్ బ్రేస్‌వెల్, మనోజ్, రజన్ కుమార్, అవినాశ్ సింగ్, సోను యాదవ్

Story first published: Wednesday, March 22, 2023, 15:05 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+