Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: డియర్ ఫ్యాన్స్.. మేం వచ్చేసాం.. ఉప్పల్‌కు పదండి! తెలుగులో మాట్లాడిన రోహిత్!

హైదరాబాద్: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు హాజరవ్వాలని తెలుగు అభిమానులను ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కోరాడు. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే ఓ వీడియో ద్వారా తెలుగులో మాట్లాడుతూ మ్యాచ్‌కు రావాలని ముంబై ఇండియన్స్ తెలుగు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు.

మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ముంబై ఇండియన్స్ జట్టు సోమవారం హైదరాబాద్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోకు క్యాప్షన్ కూడా 'కెప్టెన్ రో హైదరాబాద్ వచ్చేసాడు'అని తెలుగులో పెట్టింది. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ..'ముంబై ఫ్యాన్స్.. మేం వచ్చేస్తాం.. పదండి ఉప్పల్‌కు'అని అన్నాడు.

IPL 2023: Mumbai Indians shares Rohit Sharma speaking in telugu video ahead of SRH clash

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఫిదా అయిన ఫ్యాన్స్.. రోహిత్ శర్మ స్వాగతం పలుకుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ కోసం ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుతున్నారు. రోహిత్ శర్మ కొట్టే కొట్టుడుకు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లాలని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తిలక్ వర్మ నీ పనేగా ఇదని సెటైర్లు పేల్చుతున్నారు.

ఉప్పల్ మైదానంతో రోహిత్ శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ కెరీర్‌ ప్రారంభంలో డెక్కన్ చార్జర్స్‌కు ఆడిన రోహిత్ శర్మ.. ఉప్పల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాడు. అతనికి ఇక్కడ మంచి రికార్డులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైజాగ్ రోహిత్ వాళ్ల అమ్మమ్మ ఊరు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉన్నది. గత మ్యాచ్‌లో లూజ్ మోషన్స్‌తో బ్యాటింగ్‌కే పరిమితమైన రోహిత్.. ఉప్పల్‌లో పూర్తి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీద ఉంది.

Story first published: Monday, April 17, 2023, 22:15 [IST]
Other articles published on Apr 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+