IPL సంపాదనలో రోహిత్ శర్మనే టాప్.. హిట్ మ్యాన్ తర్వాతే ధోనీ, కోహ్లీ!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేతనాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అతను అధిగమించాడు. మనీబాల్ నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత 16 ఏళ్లలో IPL ద్వారా మొత్తం 178.6 కోట్ల రూపాయలు సంపాదించాడు. మహేంద్ర సింగ్ ధోని ఆ తర్వాత స్థానంలో నిలిచాడు. ఇన్నేళ్లలో ధోనీ ఐపీఎల్ ద్వారా రూ.176.84 కోట్లు ఆర్జించాడు. ఐపీఎల్‌లో సంపాదనలో రోహిత్-ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. 16 ఐపీఎల్ సీజన్ల ద్వారా విరాట్ ఇప్పటివరకు రూ.173.2 కోట్లు సంపాదించాడు.

12 కోట్లకు తగ్గించుకోవడంతో..
2008 ఐపీఎల్ వేలం జరిగినప్పుడు.. మహేంద్ర సింగ్ ధోని వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ.6 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ ధోనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధోనీ ఆదాయం పెరిగింది. గత ఐపీఎల్ సీజన్‌లో ధోనీ తన వేతనాన్ని రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. దాంతో అతను అగ్రస్థానాన్ని కోల్పోయాడు.

రూ.16 కోట్లు అందుకోవడంతో..
ఇక రోహిత్ శర్మను ఐపీఎల్ 2008 వేలంలో అప్పటి డెక్కన్ ఛార్జర్స్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాతి 2 సీజన్‌లలో కూడా డెక్కన్ ఛార్జర్స్ రోహిత్‌కు కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే జీతం ఇచ్చింది. 2011లో రోహిత్ రూ.9.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌తో చేరాడు. 2014లో ముంబై అతనికి 12.5 కోట్లు, 2018లో 15 కోట్లు ఇచ్చింది. ఐపీఎల్ 2022 కోసం.. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ రూ. 16 కోట్లకు అట్టిపెట్టుకుంది. దాంతో రోహిత్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.
జట్టు కోసం తగ్గించుకోవడంతో..
ఇక 2008 సీజన్‌లో రూ.12 లక్షలకు విరాట్ కోహ్లీని బెంగళూరు కొనుగోలు చేయగా.. తర్వాతి రెండు సీజన్ల వరకు అతను అంతే మొత్తానికి ఆడాడు.
2011లో ఆర్‌సీబీ రూ.8.2 కోట్ల వేతనాన్ని చెల్లించగా... 2014లో రూ.12.5 కోట్లు, 2018లో రూ.17 కోట్లు వేతనం పొందాడు. 2021 వరకు రూ.17 కోట్లు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టు కోసం రెండు కోట్లు తగ్గించుకున్నాడు. దాంతో అత్యధిక వేతనం జాబితాలో వెనకబడిపోయాడు.

రైనా, నరైన్..
ఇక, సురేశ్ రైనా ఐపీఎల్‌లో సంపాదన పరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. 14 ఏళ్లలో లీగ్ ద్వారా రూ.110.7 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత సునీల్ నరైన్ ఎక్కువ మొత్తం సంపాదించిన ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్‌కు చెందిన ఈ డాషింగ్ ఆల్‌రౌండర్ 12 ఏళ్లలో ఐపీఎల్ నుండి మొత్తం రూ.107.2 కోట్లు సంపాదించాడు. డివిలియర్స్(రూ.102.5 కోట్లు), గంభీర్(రూ.94.6 కోట్లు), ధావన్(రూ.91.8 కోట్లు), దినేశ్ కార్తీక్(రూ.86.92 కోట్లు) టాప్-10లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications