Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం! కెప్టెన్‌గా సూరీడు!

 IPL 2023: Rohit Sharma may sit out a few matches in this season to manage his workload

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్(MI) అభిమానులకు బ్యాడ్ న్యూస్. తమ అభిమాన ప్లేయర్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ కోసం హిట్‌మ్యాన్.. ఐపీఎల్ 2023 సీజన్‌ను లైట్ తీస్కోనున్నాడు.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. మెగా టోర్నీలకు ఫిట్‌గా ఉండేందుకే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని, తమ కెప్టెన్ కోరికకు ముంబై ఇండియన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) జట్టును నడిపించనున్నాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరమే రోహిత్ శర్మ.. భారత ఆటగాళ్ల వర్క్‌లోడ్‌కు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశాడు. మెగా టోర్నీలో భాగమయ్యే ప్రతీ ప్లేయర్ వర్క్‌లోడ్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుందని, ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను సమన్వయం చేయాలని సూచించాడు. ఆయా ఫ్రాంచైజీల్లో ఉన్నా.. టీమిండియా ఆటగాళ్ల ప్రిపరేషన్స్.. బీసీసీఐ కనుసన్నల్లో జరుగుతాయని తెలిపాడు. ఈ క్రమంలోనే అతనే ఇతర ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేందుకు కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

టోర్నీ పరిస్థితులను బట్టి రోహిత్ 5-7 మ్యాచ్‌లు దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వారం రోజులకే టీమిండియా.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాదే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీల నేపథ్యంలో భారత కీలక ఆటగాళ్లు గాయపడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోనుంది.

Story first published: Tuesday, March 28, 2023, 22:50 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+