For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ ఆర్‌సీబీ బ్యాటర్ రికార్డు బద్దలు!

ముంబై: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్.. మొత్తం 252 సిక్స్‌లు నమోదు చేశాడు. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(251) రికార్డును అధిగమించాడు. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు సిక్సర్ బాదిన హిట్ మ్యాన్.. మహమ్మద్ షమీ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని ఓవర్ కవర్స్ దిశగా మరో సిక్సర్ బాదాడు.

Rohit Sharma Becomes The Second Batter to hit Most sixes

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 141 ఇన్నింగ్స్‌ల్లోనే గేల్.. 357 సిక్స్‌లు బాదాడు. రోహిత్ శర్మ 243 ఇన్నింగ్స్‌ల్లో 252 సిక్స్‌లు కొట్టగా.. ఏబీ డివిలియర్స్ 170 ఇన్నింగ్స్‌ల్లో 251 సిక్స్‌లు బాదాడు. మహేంద్ర సింగ్ ధోనీ 239 సిక్స్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29), ఇషాన్ ఖిషన్ (20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రషీద్.. తన తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చాడు. తొలి బంతికి రోహిత్ శర్మను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన రషీద్.. చివరి బంతికి ఇషాన్ కిషన్‌ను వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన నెహాల్ వధేరా(15)ను రషీద్ తన మరుసటి ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, విష్ణు వినోద్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించిన అనంతరం విష్ణు వినోద్ ఔటయ్యాడు.

Story first published: Friday, May 12, 2023, 21:10 [IST]
Other articles published on May 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+