For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ.. ఏయే జట్ల దగ్గర ఎన్ని డబ్బులున్నాయంటే..?

 IPL 2023 Retention: SRH, PBKS, CSK and MI go to Mini-Auction with big Purse, KKR, GT, RR, RCB retain Core team

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. బీసీసీఐ ఇచ్చిన గడువు నేటి(నవంబర్ 15) సాయంత్రం 5 గంటలతో ముగియడంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను వెల్లడించాయి. చాలా జట్లు తమ స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌నే వేలంలోకి వదిలేసింది. అత్యధికంగా కేకేఆర్ 16, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది.

హైదరాబాద్ టాప్.. కేకేఆర్ లాస్ట్..

ఇక రిటెన్షన్ ప్రక్రియ తర్వాత అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దగ్గర పర్స్ మన్ ఉంది. ఆ జట్టు దగ్గర 42.25 కోట్లు ఉండగా.. అతి తక్కువ కేకేఆర్ దగ్గర రూ.7.05 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ దగ్గర 32.2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.20.55 కోట్లు, సీఎస్‌కే రూ. 20.45 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.13.2 కోట్లు, ఆర్‌సీబీ రూ.8.75 కోట్లు ఉన్నాయి.

ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా...

ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా...

గుజరాత్‌ టైటాన్స్..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్

గుజరాత్‌ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా

రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్

ఢిల్లీ క్యాపిటల్స్:

రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపాల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగీ ఎంగిడి, ముస్తఫిజర్‌ రెహ్మన్‌, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్

ఢిల్లీ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా

శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్

రాజస్తాన్‌ రాయల్స్‌

రిటైన్‌ లిస్ట్‌: సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్

రాజస్తాన్‌ విడిచిపెట్టిన జాబితా

అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

రిటైన్‌ లిస్ట్‌: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్

ట్రేడింగ్: శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్

కేకేఆర్‌ రిలీజ్‌ లిస్ట్‌: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్

పంజాబ్‌ కింగ్స్‌

రిటైన్‌ లిస్ట్‌: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్

పంజాబ్‌ రిలీజ్ జాబితా

మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ

ఆర్‌సీబీ:

రిటైన్ లిస్ట్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్

ఆర్సీబీ విడుదల చేసిన ఆటగాళ్లు: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:

ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా

కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్

ముంబై విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్

లక్నో సూపర్‌ జెయింట్స్‌

కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్

విడుదలైన ఆటగాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్

చెన్నై సూపర్ కింగ్స్

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్‌, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ

విడిచిపెట్టిన ఆటగాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్.

Story first published: Tuesday, November 15, 2022, 21:28 [IST]
Other articles published on Nov 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+