
హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచిన ముంబై.. అప్‌కమింగ్ సీజన్‌లో బలంగా తిరిగిరావాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ ప్రక్రియలో ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలేసింది. దాంతో ముంబై పర్స్‌లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో డిసెంబర్ 23న జరిగే మినీవేలంలో సత్తా కలిగిన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక గతేడాది ఆర్‌సీబీకి ఇచ్చిన జాసన్ బెహ్రెండార్ఫ్‌ను మళ్లీ ట్రేడ్ చేసుకుంది.
కీరన్ పోలార్డ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకున్న ముంబై ఇండియన్స్.. దేశవాళీ స్టార్ ఆటగాళ్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్‌లతో పాటు అంతర్జాతీయ ప్లేయర్స్ డానియల్ సామ్స్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్‌లను వదిలేసింది. కోర్ టీమ్‌ను మాత్రమే అలాగే కొనసాగించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్‌లను రిటైన్ చేసుకుంది. ఇక ముంబై జట్టులో మూడు ఓవర్‌సీస్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ రిటెన్షన్ జాబితా..
రోహిత్ శర్మ(కెప్టెన్), టీమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్(ట్రేడింగ్)
ముంబై విడుదల చేసిన ప్లేయర్లు..
అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్, డానియల్ సామ్స్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్