Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 యాడ్ రెవెన్యూ రూ. 10,120 కోట్లు!

న్యూఢిల్లీ: బీసీసీఐకి కాసుల పంట కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మరో ఘనతను అందుకుంది. యాడ్ రెవెన్యూలో అనూహ్య పురోగతిని సాధించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌‌లో యాడ్ రెవెన్యూ రూ. 10,120 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని లైవ్‌మింట్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇందులో 65 శాతం ఆదాయం బీసీసీఐ, ఫ్రాంచైజీ ఓనర్లు, బ్రాడ్‌కాస్టర్స్ నేరుగా అందుకోగా.. ఇతర మార్గాల్లో మరో 35 శాతం ఆదాయం సమకూరింది.
సోషల్ మీడియా, ట్రెడిషనల్ మీడియా, ఇతర ఇంటర్నెట్ ఫ్లాట్ ఫామ్స్ ఆధారంగా ఈ ఆదాయం వచ్చింది. టాప్-3 సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోనే ఎక్కువగా ఆదాయం వచ్చినట్లు లైవ్ మింట్ తన కథనంలో పేర్కొంది.

IPL 2023: Reports says IPL Ad Revenue for this season is 10,120 crore

దాదాపు 96 శాతం ఆ మూడింటి ద్వారానే వచ్చాయని తెలిపింది. ఈ ఫ్లాట్‌ఫామ్స్ వేదికగా వీకెండ్స్‌లో ఈ ఆదాయం ఎక్కువగా ఉందని తెలిపింది. ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ బ్రాడ్ కాస్టర్ జియో సినిమా రూ.4700 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఓవర్ మధ్యలో వచ్చే యాడ్స్‌తో పాటు అఫిషియల్ పార్టనర్స్ ద్వారా బ్రాడ్ కాస్టర్స్ ఈ ఆదాయాన్ని అందుకున్నాయి.

10 ఫ్రాంచైజీలకు నేరుగా యాడ్ రెవెన్యూ 1450 కోట్లు రాగా.. బీసీసీఐకి యాడ్ రెవెన్యూ ద్వారా 430 కోట్లు వచ్చాయి. బీసీసీఐ స్పాన్సర్ షిప్, స్టేడియం అడ్వర్టైజింగ్ ద్వారా బీసీసీఐకి ఈ ఆదాయం రాగా.. ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌తో ఆయ జట్లు ఆదాయాన్ని పొందాయి.

ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో రవీంద్ర జడేజా సంచలన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో సారి ఛాంపియన్‌గా నిలిచింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. ప్రతీ ఏటా అభివృద్ది చెందుతూ ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెట్ లీగ్‌గా నిలిచిపోయింది. ఓవరాల్‌గా రెండో స్పోర్ట్స్ ఈవెంట్‌గా చరిత్రకెక్కింది.

ఈ క్రమంలోనే ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారు. ఐపీఎల్ జరిగినన్నీ రోజులు అంతర్జాతీయ క్రికెటే ఆగిపోతుందంటేనే ఈ టోర్నీ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Story first published: Tuesday, July 4, 2023, 12:32 [IST]
Other articles published on Jul 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+