Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023లో బద్దలయ్యే రికార్డులు ఇవే!

 IPL 2023: Records That May Be Beaten In IPL 16

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో ఈ ధనాధన్ లీగ్‌కు తెరలేవనుంది. శుక్రవారం(మార్చి 31) అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్ మొదలవ్వనుంది. రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈ సారి లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బీసీసీఐ కూడా కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. మరి కొన్నింట్లో మార్పులూ చేసింది. వైడ్‌, నోబాల్‌కు సమీక్ష, టాస్‌ తర్వాత తుది జట్టు ప్రకటన, ఇంపాక్ట్‌ ప్లేయర్‌.. ఇలా ఎన్నో కొత్త విషయాలను ఈ సీజన్‌లో చూడబోతున్నాం. ఇక రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐపీఎల్‌లో ఈసారి కూడా కొన్ని రికార్డులు బద్దలవనున్నాయి. వాటిపై ఓ లుక్కెద్దాం!

1.ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు:
సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో.. సీఎస్‌కే బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించాడు. దాంతో అతని పేరిట ఉన్న ఈ యూనిక్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్(166), అమిత్ మిశ్రా(166), పీయూష్ చావ్లా(157), రవిచంద్రన్ అశ్విన్(157)లకు బ్రావోను అధిగమించే అవకాశం ఉంది.

2. అత్యధిక మ్యాచ్‌లు:
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ నిలవనున్నాడు. ఇప్పటికే 234 మ్యాచ్‌లతో టాప్‌లో ఉన్న ధోనీ.. 250 మ్యాచ్‌ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది.

3. అత్యధిక పరుగుల రికార్డు:
6624 పరుగులతో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉండగా.. 6244 రన్స్‌తో శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఈ ఇద్దరూ ఏడు వేల పరుగుల మైలురాయి అందుకునే అవకాశం ఉంది. డేవిడ్ వార్నర్(5881), రోహిత్ శర్మ(5879) 6వేల పరుగుల మైలురాయి అందుకోనున్నారు.

4. అత్యధిక సిక్స్‌లు:
ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు క్రిస్ గేల్(357) పేరిట ఉంది. అతని తర్వాత ఏబీ డివిలియర్స్(251) ఉన్నాడు. గేల్ రికార్డు బద్దలవ్వకున్నా.. డివిలియర్స్ రికార్డును రోహిత్ శర్మ(240) అధిగమించే చాన్స్ ఉంది.

 IPL 2023: Records That May Be Beaten In IPL 16

5. అత్యధిక హాఫ్ సెంచరీలు:
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్(54) అత్యధిక హాఫ్ సెంచరీలు బాదగా.. అతని తర్వాత ఉన్న శిఖర్ ధావన్(47), విరాట్ కోహ్లీ(44) 50 హాఫ్ సెంచరీల మార్క్ అందుకునే అవకాశం ఉంది.

6. అత్యధిక సెంచరీలు:
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన రికార్డు క్రిస్ గేల్(6) పేరిట ఉండగా.. జోస్ బట్లర్(5), విరాట్ కోహ్లీ(5), కేఎల్ రాహుల్(4), డేవిడ్ వార్నర్(4)లకు అతన్ని అధిగమించే ఛాన్స్ ఉంది.

7. అత్యధిక డక్స్:
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్‌గా మన్‌దీప్ సింగ్(14), రోహిత్ శర్మ(14) టాప్‌లో ఉండగా.. ఈ సారి ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.

8. అత్యధిక ఫోర్లు:
శిఖర్ ధావన్(701) అత్యధిక ఫోర్లు బాదగా.. విరాట్ కోహ్లీ(578), డేవిడ్ వార్నర్(561) అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ఇద్దరూ ధావన్‌ను అధిగమించలేకపోయినా.. 600 ఫోర్ల మైలు రాయి అందుకునే అవకాశం ఉంది.

9. అత్యధిక డాట్ బాల్స్:
ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్(1406 డాట్ బాల్స్) టాప్‌లో ఉన్నాడు. అతను 1500 డాట్ బాల్స్ ఘనతను అందుకునే చాన్స్ ఉంది. అంతేకాకుండా భువనేశ్వర్ కుమార్.. ఐపీఎల్‌లో 4 మెయిడిన్ ఓవర్స్ వేయగా.. ప్రవీణ్ కుమార్(14 మెయిడిన్ ఓవర్స్)తో టాప్‌లో ఉన్నాడు.

10. హ్యాట్రిక్ వికెట్స్:
ఐపీఎల్‌లో అమిత్ మిశ్రా మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్ ఘనత అందుకున్నాడు.

11. అత్యధిక ఐదు వికెట్ల ఘనత:
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా జేమ్స్ ఫాల్కనర్(4) టాప్‌లో ఉన్నాడు. మరే బౌలర్ కూడా అతన్ని అధిగమించే అవకాశం లేదు. అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా మాత్రం సునీల్ నరైన్(7) టాప్‌లో ఉన్నాడు.

12. అత్యధిక క్యాచ్‌లు:
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ సురేశ్ రైనా(109) టాప్‌లో ఉన్నాడు. కీరన్ పొలార్డ్(103), రోహిత్ శర్మ(97), విరాట్ కోహ్లీ(93) అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, March 28, 2023, 19:07 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+