Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: పెళ్లి చేసుకుంటే ఆర్‌సీబీ పోరీలనే చేసుకోవాలి మామ!

హైదరాబాద్: ఐపీఎల్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ). ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఫ్రాంచైజీకి అభిమానులున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు ప్రధాన ఆటగాడు కావడంతో ఆ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న 10 ఫ్రాంచైజీల్లో ఆర్‌సీబీకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను చూసినా.. ఆర్‌సీబీ ఎక్కడ ఆడినా.. ఆ జట్టుకు లభించే ప్రేక్షకుల మద్దతు గమనించినా.. ఈ విషయం అర్థమవుతోంది. సొంత మైదానంలో ఆ జట్టు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. మైదానం మొత్తం ఆర్‌సీబీ అభిమానులే ఉంటారు. ప్రత్యర్థి జట్టుకు పాయింట్ పర్సంట్ మద్దతు కూడా లభించదు.

RCB Fan Marriage

ప్రపంచంలోనే ఆర్‌సీబీ అభిమానులంత విశ్వాసపాత్రులు మరేవరూ లేరని చెప్పాలి. గత 15 సీజన్లుగా ఆ జట్టు టైటిల్ గెలవకపోయినా.. అభిమానులు ఆ జట్టుకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. 'ఈ సాల కప్ నమ్దే' అంటూ ప్రతీ సీజన్‌లో ఊరించి ఊసురుమనిపించినా.. పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచినా ఆ జట్టు అభిమానుల సంఖ్య మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.

తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుకు లభించిన మద్దతూ... ఓటమి తర్వాత ఫ్యాన్స్ చూపించిన ఏమోషన్ వారు ఎంత లాయల్‌గా ఉన్నారనే విషయాన్ని తెలియజేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి తట్టుకోలేక కొందరు అమ్మాయిలు ఏడ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండే ఆర్‌సీబీ అభిమానులను పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఆర్‌సీబీ అభిమానినే పెళ్లి చేసుకోవాలని సంసార నిపుణులు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.

ఆర్‌సీబీ అభిమానులను చేసుకుంటే.. విఫలమైనా.. వదిలి పెట్టరని, జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. నమ్మకంగా ఉంటూ సక్సెస్ కోసం కావాల్సిన మోటీవేషన్ అందిస్తారని పేర్కొంటున్నారు. ఇతరులు మోసం చేసే అవకాశం ఉందని.. ఆర్‌సీబీ అభిమానులు మాత్రం చాలా విశ్వాసంగా ఉంటారని చెబుతున్నారు.

ఆర్‌సీబీ ఫ్యాన్స్.. చాలా భావోద్వేగపూరితమైన మనుషలని, నవ్వుతూ, ఏడుస్తూ ఆస్వాదిస్తూ జీవితాంతాం మీతోనే చాలా నీజాయితీగా ఉంటారని సూచిస్తున్నారు. ఆర్‌సీబీ అభిమానులను పెళ్లి చేసుకుంటే మరో అడ్వాంటేజ్ కూడా ఉందని, వారు గతం, భవిష్యత్త్ కాలం గురించి ఆలోచించారని, ప్రస్తుతం ఎలా ఉన్నదే చూస్తారని సలహా ఇస్తున్నారు.

ఆర్‌సీబీ అభిమానులకు ఉండేంత ఓపిక మరేవరికీ ఉండదని, వారిని పెళ్లి చేసుకుంటే సంసారం హాయిగా ఉంటుందని హితవు పలుకుతున్నారు.

Story first published: Wednesday, April 12, 2023, 20:10 [IST]
Other articles published on Apr 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+