Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: మళ్లీ ఆర్‌సీబీ X లక్నో? కయ్యానికి కాలు దువ్వుతున్న గంభీర్ టీమ్!

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదిరిపోయే విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 112 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. రన్ రేట్ కూడా నెగటీవ్(-0.3) నుంచి (0.166) పాజిటీవ్‌గా మారింది. ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది.

చివరి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(మే18), గుజరాత్ టైటాన్స్(మే21)‌తో విజయం సాధిస్తే ఆర్‌సీబీ నేరుగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. అయితే ఇతర జట్ల ఫలితాలు కూడా ఆర్‌సీబీ అనుకూలంగా ఉంటేనే ఇది జరుగుతోంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ కనీసం ఒక్క మ్యాచ్ ఓడాలి. పంజాబ్ కింగ్స్ కూడా ఓ మ్యాచ్ ఓడితే ఆర్‌సీబీకి ప్లే ఆఫ్స్ మార్గం సుగుమం అవుతోంది.

RCB vs LSG again in IPL 16 Eliminator? Lucknow sensational post

ఇక ఆర్‌సీబీ భారీ విజయం నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆర్‌సీబీని అభినందిస్తూ కయ్యానికి కాలు దువ్వింది. ఎలిమినేటర్‌లో కలుసుకుందామని సవాల్ విసిరింది. ఐపీఎల్‌లో లక్నో-బెంగళూరు పోరు భారత్-పాక్‌లా మారిపోయింది.

లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య నెలకొన్న గొడవ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య వైరం కొనసాగనుంది. ఈ క్రమంలోనే ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీ-లక్నో తలపడితే అసలు సిసలు మజా దక్కనుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ ఎలిమినేటర్‌లో తలపడాలంటే ముంబై ఇండియన్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి.

పంజాబ్ కింగ్స్ కూడా ఓ మ్యాచ్‌లో పరాజయంపాలై.. ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తదుపరి మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఇది సాధ్యమవుతోంది. ఇది జరగడానికి కాస్త కష్టంగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం జరిగి తీరుతుందని కామెంట్ చేస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం ముంబై ఇండియన్స్‌తో, కేకేఆర్‌తో 24న తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 17 పాయింట్లతో లక్నో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. ఆర్‌సీబీతో ఎలిమినేటర్ ఆడాలంటే.. కేకేఆర్ చేతిలో ఓడినా.. ముంబై ఇండియన్స్ చేతిలో మాత్రం ఓడిపోవద్దు.

Story first published: Monday, May 15, 2023, 14:10 [IST]
Other articles published on May 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+