IPL 2023: మినీ వేలం తర్వాత పటిష్టంగా ఆర్‌సీబీ.. తుది జట్టు అంచనా ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తృటిలో టైటిల్ కోల్పోయింది. 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఆర్‌సీబీ.. క్వాలియఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. జోస్ బట్లర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ ఫైనల్ చేరలేకపోయింది.
టైటిల్ అందుకోలేకపోయినా.. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చింది. దాంతోనే కోర్ టీమ్ మొత్తాన్ని రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. బ్యాకప్ ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేసింది. దాంతో రూ.8.75 కోట్ల అతి తక్కువ పర్స్‌మనీతో ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొంది.
తక్కువ డబ్బులతోనైనా తెలివిగా ఏడుగురి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్‌ను రూ.3.2 కోట్లకు తీసుకున్న ఆర్‌సీబీ లెఫ్టార్మ్ పేసర్ టోప్లీ రూ.1.9 కోట్లు ఖర్చు చేసింది. హిమాన్షు శర్మ, రజన్ కుమార్, అవినాశ్ సింగ్, సోను యాదవ్ వంటి అనామక ఆటగాళ్లను కూడా తీసుకుంది. ఈ మినీ వేలంతో ఆర్‌సీబీ బ్యాకప్ కూడా బలంగా మారింది. పటిష్టంగా మారిన ఆర్‌సీబీ తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం.!

ఓపెనర్లుగా కోహ్లీ, డుప్లెసిస్..
ఆర్‌సీబీకి ఉన్న ఏకైక లోటు సరైన ఓపెనర్ లేకపోవడం. మినీ వేలంలో మయాంక్ అగర్వాల్ కోసం ప్రయత్నించినా అతను దక్కలేదు. పైగా కోహ్లీనే తమ ఓపెనరని ఆర్‌సీబీ భావిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. గత సీజన్‌లో ఈ జోడీ మంచి ఆరంభాలను అందించింది. 16 మ్యాచ్‌ల్లో కోహ్లీ 2 హాఫ్ సెంచరీలతో 341 పరుగులు చేయగా.. ఫాఫ్ డుప్లెసిస్ 3 హాఫ్ సెంచరీలతో 468 పరుగులు చేశాడు. ఈ సారి కూడా ఈ జోడీనే ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

మిడిలార్డర్‌లో రజత్ పటీదార్, మ్యాక్సీ..
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీకి రజత్ పటీదార్ సర్‌ప్రైజ్ స్టార్‌గా దొరికాడు. ఇంజ్యూరీ రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన రజత్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 404 పరుగులు చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి జట్టు మిడిలార్డర్ బాధ్యతలు మోసాడు. నాలుగో స్థానంలో మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగనున్నాడు.
మ్యాక్సీ కూడా 13 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్ సెంచరీతో 301 పరుగులతో రాణించాడు. అయితే ఈ సీజన్‌లో అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. దాంతోనే అతనికి బ్యాకప్‌గా విల్ జాక్స్‌ను తీసుకుంది. ఐదో స్థానంలో మహిపాల్ లోమ్రోర్ ఆడే అవకాశం ఉంది.

ఫినిషర్‌గా డీకే, షెహ్‌బాజ్..
ఆరోస్థానంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఆడనుండగా.. ఏడో స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షెహ్‌బాజ్ ఆడనున్నాడు. ఈ ఇద్దరూ గత సీజన్‌లో దుమ్మురేపారు. ముఖ్యంగా కార్తీక్ 2.0 వర్షన్ గేమ్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. విలువైన పరుగులతో ఆర్‌సీబీకీ చిరస్మరణీయ విజయాలు అందించాడు. డీకే 10 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్ సెంచరీలతో 330 పరుగులు చేశాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

జోష్ హజెల్ వుడ్ సారథ్యంలో..
జోష్ హజెల్ వుడ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. జోష్ హజెల్ వుడ్ ఆడే 10వ స్థానం వరకు ఆర్‌సీబీకి బ్యాటింగ్ డెప్త్ ఉండటం కలిసొచ్చే అంశం. హర్షల్ పటేల్ సైతం మెరుపు మెరిపించగలడు. రీస్ టోప్లీని బ్యాకప్ పేసర్‌గా తీసుకున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో హజెల్ వుడ్ 12 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ 15 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మాత్రం 15 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లే తీసాడు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్
ఆర్‌సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాశ్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, వానిందు హసరంగా, షెహ్‌బాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, కర్న్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాశ్ దీప్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, విల్ జాక్స్, మనోజ్, రజన్ కుమార్, అవినాశ్ సింగ్, సోను యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications